టిక్‌టాక్‌ APK డౌన్‌లోడ్‌ చేస్తున్నారా? జాగ్రత్త!
close

తాజా వార్తలు

Updated : 14/08/2020 12:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టిక్‌టాక్‌ APK డౌన్‌లోడ్‌ చేస్తున్నారా? జాగ్రత్త!

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన వీడియో యాప్‌ టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం ఇటీవల నిషేధించినా కొందరు ఆ యాప్‌ను అనధికారికంగా డౌన్‌లోడ్‌ చేస్తున్నారు. అలాంటి వారు కోరి ప్రమాదం తెచ్చుకున్నట్లే అని సైబర్‌ నిపుణులు అంటున్నారు. ఏపీకే ఫైల్‌ ద్వారా టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేవారు త్వరలోనే సైబర్‌ దాడికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిపై అమెరికాలో సైబర్‌ సెక్యూరిటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్న బుసారపు వెంకట్‌రామన్‌ ఈ ప్రమాదం గురించి వివరించారు.

‘‘సాధారణంగా ఆండ్రాయిడ్‌ ఫోన్లలో యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ ద్వారానే డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా సైడ్‌లోడింగ్‌ పద్ధతిలో కూడా యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. థర్డ్‌ పార్టీ సైట్‌కి వెళ్లి సంబంధిత యాప్‌కు సంబంధించిన ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇలానే టిక్‌టాక్‌ విషయంలోనూ కొన్ని లింకులు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి. వాటిని క్లిక్‌ చేస్తే యాప్‌తో పాటు మాల్‌వేర్‌ కూడా మీ ఫోన్లో చొరబడే ప్రమాదముంది’’ అని హెచ్చరించారు. కెమెరా, మైక్రోఫోన్‌ ఇతర పర్మిషన్స్‌ ఇవ్వడం వల్ల రిమోట్‌గా మీ వ్యక్తిగత వివరాలన్నీ సైబర్‌ నేరగాళ్లు చోరీ చేసే ప్రమాదముందని తెలిపారు. గతంలో పోకేమాన్‌గో గేమ్‌ను కూడా ఇలానే పలువురు డౌన్‌లోడ్‌ చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు.

 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని