
తాజా వార్తలు
జంతువుల కోసమూ ఓ వంతెన
ఉత్తరాఖండ్ అటవీశాఖ వినూత్న ఆలోచన
డెహ్రాడూన్: నిత్యం రాకపోకలతో బిజీగా ఉండే రహదారిని దాటుతూ సరీసృపాలు, జంతువులు మృతిచెందుతుండటంతో ఆ సమస్యను అధిగమించేందుకు ఉత్తరాఖండ్ అటవీశాఖ వినూత్న ఆలోచనకు తెరలేపింది. రహదారిపై జంతువుల రాకపోకల కోసం బ్రిడ్జ్ నిర్మించింది. నైనిటాల్ జిల్లా రాంనగర్ అడవిలోని కలదుంగి-నైనితాల్ రహదారి మధ్యలో 90 ఫీట్ల పర్యావరణహిత బ్రిడ్జిని నిర్మించింది. వెదురు కర్రలు, జూట్, గడ్డితో వంతెనను రూపొందించింది. 40 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పుగల వంతెన నిర్మాణం కోసం రూ.2 లక్షలు ఖర్చయ్యింది. కేవలం పది రోజుల్లో ఆ బ్రిడ్జిని పూర్తిచేశారు.
జంతువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పర్యావరణహిత వంతెన ముగ్గురు వ్యక్తుల బరువును కూడా ఆపగలుగుతుంది. సరీసృపాలే కాకుండా చిరుతల్లాంటి జంతువులు రోడ్డు దాటేందుకు ఈ బ్రిడ్జి ఎంతగానో ఉపయోగపడుతుందని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు కలదుంగి-నైనిటాల్ రహదారి గుండా రాకపోకలు సాగిస్తాయి. అయితే ఆ అటవీ ప్రాంతంలో జీవించే సరీసృపాలతోపాటు కోతులు, ఉడతలు ఇతర జంతువులు రోడ్డు దాటుతూ మృతిచెందుతున్నాయి. ఈ ప్రమాదాల నుంచి జంతువులను కాపాడేందుకు అటవీశాఖ అధికారులు ఈ తరహా ప్రయత్నం చేశారు. ఉత్తరాఖండ్ అటవీశాఖ అధికారి వైభవ్సింగ్ వంతెన ఫొటోలను ట్విటర్ ద్వారా పంచుకున్నారు. జంతువుల శ్రేయస్సు కోసం అధికారులు తీసుకున్న ఈ చర్యలపట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్ చిరస్మరణీయ విజయం..
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- భారత్ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు
- ఆసీస్ పొగరుకు, గర్వానికి ఓటమిది
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
