శిక్షిస్తారా?.. వదిలేస్తారా?: ఖుష్బూ
close

తాజా వార్తలు

Published : 18/04/2020 21:46 IST

శిక్షిస్తారా?.. వదిలేస్తారా?: ఖుష్బూ

కుమారస్వామి తనయుడి పెళ్లిపై నటి ఘాటు వ్యాఖ్యలు

చెన్నై: ‘లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనలు అందరికీ వర్తించవా?’ అని ప్రశ్నిస్తున్నారు సీనియర్‌ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌, రేవతిల వివాహం దుమారం రేపిన సంగతి తెలిసిందే. రామనగరలో శుక్రవారం వీరి వివాహం జరిపించారు. కుటుంబ సభ్యులతోపాటు సీఎం యడియూరప్ప కూడా పెళ్లిలో పాల్గొన్నారు. కొందరు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారని, వారెవరూ మాస్కులు ధరించలేదని సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు పేర్కొన్నాయి. కుటుంబ సభ్యులతోపాటు ఇతరులు కూడా మాస్కులు ధరించలేదని, వ్యక్తిగత దూరం పాటించలేదని నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధించడంతో నిర్వహణపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి యడియూరప్ప ఆదేశించారు.

ఈ ఘటనపై ఖుష్బూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ‘నిబంధనలు అందరికీ ఒకేలా ఉండవా? కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన కుటుంబాన్ని శిక్షించకుండా వదిలేస్తారా.. లేదా సూరత్‌లోని జంటపై, వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకున్నట్లే వీరిపై కూడా తీసుకుంటారా? కరోనా వైరస్‌ మతం, కులం, అధికారం, ప్రాంతం వంటివి చూడదు. మరి వేర్వేరు నిబంధనలు ఎందుకు? మార్గం చూపించాల్సిన విద్యావంతులు కూడా నియమాలను ఉల్లంఘించడం సిగ్గుపడాల్సిన విషయం’ అని ఆమె ఘాటుగా పోస్ట్‌ చేశారు. బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ కూడా ఈ పెళ్లి జరిగిన విధానంపై మండిపడ్డ సంగతి తెలిసిందే. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని