నా అల్లుడే కొట్టి చంపేశాడు: చిత్ర తల్లి
close

తాజా వార్తలు

Updated : 12/12/2020 19:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా అల్లుడే కొట్టి చంపేశాడు: చిత్ర తల్లి

నటి ఆత్మహత్యపై ఆరోపణలు

చెన్నై: ‘పాండియన్‌ స్టోర్స్‌’ అనే సీరియల్‌తో తమిళ ప్రేక్షకులకు చేరువైన నటి చిత్ర ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. చెన్నైలోని ఓ హోటల్‌ గదిలో ఆమె బుధవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చిత్ర మృతదేహానికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారడంతో మృతిపట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర తల్లి కూడా మృతిపట్ల తనకున్న అనుమానాలను బహిర్గతం చేశారు.

తన అల్లుడు హేమంతే(చిత్ర భర్త) చిత్రను కొట్టి చంపేసి ఉంటాడని ఆమె అన్నారు. అందుకే, చిత్ర మృతదేహంపై చెంపదెబ్బల ఆనవాళ్లు ఉన్నాయని ఆమె తెలిపారు. మరోవైపు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర తండ్రి మాట్లాడుతూ.. ‘చిత్ర-హేమంత్‌ ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ కొన్నినెలల క్రితమే రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లి గురించి అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నాక ఈ ఏడాదిలో పెద్దలందరి సమక్షంలో నిశ్చితార్థం జరుపుకొన్నారు. నా కూతురు ఆత్మహత్య పాల్పడడానికి గల కారణమేంటో తెలియడం లేదు’ అని తెలిపారు.

ఇదీ చదవండి

అనుమానాస్పద స్థితిలో యువ నటి మృతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని