రైతు నుంచి రూ.7వేల లంచం.. వైరల్‌ వీడియో
close

తాజా వార్తలు

Published : 20/12/2020 14:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైతు నుంచి రూ.7వేల లంచం.. వైరల్‌ వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: పని త్వరగా కావాలంటే నువ్వు ఇచ్చిన డబ్బు సరిపోదు.. పైస్థాయిలో ఉన్నవారికి ఇచ్చుకోవాలంటూ రైతు నుంచి వీఆర్‌వో లంచం వసూలు చేసిన దృశ్యాలున్న ఓ వీడియో వైరల్‌గా మారింది. అనంతపురం జిల్లా గార్లదిన్నెలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భూమి వివరాలు ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు ఓ రైతు గార్లదిన్నె వీఆర్‌వో శ్రీధర్‌ను సంప్రదించాడు. పని త్వరగా కావాలంటూ మొరపెట్టుకుని ముందుగా రూ.3 వేలు ఇచ్చాడు. అయితే, ఈ మొత్తంలో తనకేమీ దక్కదని అంతా పైస్థాయి వారికే వెళుతుందంటూ మరో 4 వేల రూపాయలు వసూలు చేశాడు. ఈ ఘటనను రైతు వీడియో తీసి సామజిక మాధ్యమాల్లో ఉంచగా అది వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి...

విశాఖలో తెదేపా ఎమ్మెల్యే భూమి స్వాధీనంTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని