close

తాజా వార్తలు

Updated : 29/11/2020 10:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తిరుమలలో 25 నుంచి వైకుంఠద్వార దర్శనం

తిరుమల: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలో డిసెంబర్‌ 25 నుంచి పది రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచనున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు తితిదే ధర్మకర్తల మండలి తీర్మానాలను సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠం, తిరుచానూరు ఆలయంలోని సూర్యప్రభ వాహనానికి బంగారు తాపడం చేయించనున్నట్లు చెప్పారు. నడక దారిలోని గోపురాలకు మరమ్మతులు చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే తిరుమలకు 100 నుంచి 150 ఎలక్ట్రిక్‌ బస్సులు నడపాలని మండలి సమావేశంలో తీర్మానించామన్నారు. అనాథ పిల్లల కోసం తితిదే నిర్వహిస్తున్న బాలమందిరంలో రూ.10 కోట్లతో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తితిదే పరిధిలో సౌర, పవనశక్తి వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నామని.. అందుకుగాను చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. హిందూ సనాతన ధర్మ పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో స్వామివారి కల్యాణం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.

దేవస్థానం ఆస్తులపై శ్వేతపత్రం..

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. భక్తులు స్వామివారికి సమర్పించిన ఆస్తుల వివరాలను వెల్లడిస్తామన్నారు. తితిదే ఆస్తులకు సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేసి, పీఠాధిపతులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అంతేకాకుండా డిపాజిట్లను జాతీయ బ్యాంకుల్లోనే కొనసాగించాలని ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించిన్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాల సెక్యూరిటీ బాండ్ల కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు చెప్పారు.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని