close

తాజా వార్తలు

Published : 30/10/2020 10:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధోనీని ఔట్‌ చేసి.. అతడి నుంచే సలహాలు!!

కోల్‌కతా స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి 

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ దిగ్గజం మహేంద్రసింగ్‌ ధోనీని ఒక్కసారి ఔట్‌ చేస్తే చాలు ఏ బౌలరైనా సంతోషంతో ఎగిరి గంతేస్తాడు. అలాంటిది కోల్‌కతా స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఈ సీజన్‌లో చెన్నై కెప్టెన్‌ను రెండు సార్లు పెవిలియన్‌ పంపాడు. గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ధోనీ(1) పరుగుకే వెనుతిరిగిన సంగతి తెలిసిందే. 15వ ఓవర్‌ వేసిన వరుణ్‌ నాలుగో బంతికి మహీని బౌల్డ్‌ చేశాడు. దీంతో చెన్నై గెలుపుపై అనుమానాలు రేకెత్తాయి. కానీ చివర్లో ధాటిగా ఆడిన రవీంద్ర జడేజా(31*; 11 బంతుల్లో 2x4, 3x6), సామ్‌కరన్‌(13*)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఇక మ్యాచ్‌ అనంతరం వరుణ్‌ తన అభిమాన క్రికెటర్‌ అయిన మహేంద్రసింగ్‌ ధోనీ వద్దకు వెళ్లి కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన ఆరాధ్య క్రికెటర్‌ నుంచి పలు విలువైన సూచనలు పొందాడు. ఈ వీడియోను కోల్‌కతా టీమ్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. చెపాక్‌ స్టేడియంలో అభిమానించే స్థాయి నుంచి ఇక్కడి దాకా అంటూ పేర్కొంది. గతేడాది నుంచి కోల్‌కతా తరఫున ఆడుతున్న వరుణ్‌ ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. దిల్లీతో తలపడిన మ్యాచ్‌లో ఏకంగా ఐదు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. అంతకుముందు ఈ చెన్నై క్రికెటర్‌ చెపాక్‌ స్టేడియంలో ధోనీ బ్యాటింగ్‌ను ఆస్వాదించేవాడు. స్టాండ్స్‌లో నిలబడి మహీ సిక్సులను ఎంజాయ్‌ చేసేవాడు. ఈ క్రమంలోనే కష్టపడి బౌలర్‌గా ఎదిగాడు. ఇప్పుడు కోల్‌కతా స్పిన్నర్‌గా రాణిస్తుండడంతో ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 జట్టుకు ఎంపికయ్యాడు.

ఇవీ చదవండి..

ఉత్కంఠ పోరులో చెన్నై విజయం

సూర్యకుమార్‌.. న్యూజిలాండ్‌ జట్టుకు ఆడు!




Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని