
తాజా వార్తలు
కోలుకుంటున్నారని సంతోషించా.. అంతలోనే..
బాలు మరణం పట్ల వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి
దిల్లీ: గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్విటర్లో భావోద్వేగ సందేశాన్ని ఉంచారు. బాలు ఆస్పత్రిలో ఉన్న రోజుల్లో ఆయన ఆరోగ్యంపై వాకబు చేసిన విషయాన్ని వెల్లడిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోలుకుంటున్నారని తెలిసి సంతోషిస్తున్న తరుణంలోనే ఇలా జరగడం తీవ్ర బాధను కలిగించిందన్నారు. ఒకే ఊరివాడైనందున చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయాన్ని ప్రస్తావిస్తూ.. ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు.
‘‘ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్దాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది. గాన గంధర్వుడైన ఎస్పీ బాలు మా ఊరివాడైనందున చిన్నప్పటి నుంచి చాలా పరిచయముంది. ఆయన కోలుకుంటున్నారని, రోజూ కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడుతున్నారని తెలిసి సంతోషిస్తుండగానే ఇలా జరగడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వివిధ భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన బాలు ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వేలాది యువ తెలుగు గళాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు’’ అని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.
కరోనా సోకడంతో గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలకు గురైన బాలు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1.04గంటలకు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తన గానంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని వీనుల విందు చేసిన సంగీత యోధుడి మరణం యావత్ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆగస్టు 5న ఎస్పీబీ తనకు కరోనా సోకినట్టు ప్రకటించారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందుతున్న బాలు ఆరోగ్యం గతంలో ఓసారి విషమించడంతో ఎక్మో, వెంటిలేటర్ సాయంతో చికిత్స కొనసాగిస్తూ వచ్చారు. అయినా ఫలితం లేకపోయింది.
ఇదీ చదవండి...
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- నాన్‌స్టాప్ ‘ఫన్’షూట్.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- మరో 6 పరుగులు చేసుంటే..
- టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డ్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
