close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120025392 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => LQOnshV14QM [video_short_link] => LQOnshV14QM [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-22 17:06:14.881317 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

అలవాట్లు మారాలి.. జంక్‌ఫుడ్‌ ప్రభావం పోవాలి

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన

హైదరాబాద్‌: ప్రజల జీవన శైలివల్లే సమాజంలో వింత జబ్బులు వస్తున్నాయని, ఆహారపు అలవాట్లు మారాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజల్లో సోమరితనంతో పాటు జంక్‌ఫుడ్‌ ప్రభావం పోవాలని సూచించారు. శనివారం ఆయన ముచ్చింతల్‌ స్వర్ణభారత్‌ ట్రస్ట్‌‌, యశోద ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మ అవార్డుల గ్రహీతలు పీవీ సింధు, భాష్యం విజయసారథి, చింతల వెంకట్‌ రెడ్డిని సన్మానించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..  ‘‘బ్యాలెట్‌ ద్వారా ఎంత పెద్దవారినైనా దించేయొచ్చు.కొందరు సృష్టిస్తున్న హింసను ప్రజలు చూస్తూ ఊరుకోవడం మంచిది కాదు. విధ్వంసం సమాజానికి మంచిది కాదు. విధ్వంసాన్ని ప్రోత్సహించడం కూడా తప్పే. 12 మంది రైతులకు పద్మ అవార్డులు రావడం గొప్ప విషయం. పేరు తెచ్చే వారిని సన్మానిస్తే సమాజం తనను తాను గౌరవించుకున్నట్టే. ప్రజల జీవనశైలి వల్లే సమాజంలో వింత జబ్బులు వస్తున్నాయి. ప్రజల్లో సోమరితనం, జంక్‌ఫుడ్‌ ప్రభావం పోవాలి’’ అన్నారు.

మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ
‘‘పేదలకు దూరమైన వైద్యాన్ని దగ్గర చేయడమే స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ లక్ష్యం. విద్య, వైద్యం, నైపుణ్యం పెంపొందించడమే ట్రస్ట్‌ ఉద్దేశం. ప్రకృతిని నిర్లక్ష్యం చేసినందుకు మానవాళిపై ఉగ్రరూపం చూపిస్తోంది. దేశం వేగంగా ముందుకెళ్తున్నా ఇంకా చాలామంది వెనుకబడే ఉన్నారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ. మాతృభాషలో ప్రతిభ ఉంటేనే ఇతర భాషలను వేగంగా నేర్చుకోవచ్చు’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, భాజపా నేతలు లక్ష్మణ్‌, రాంచందర్‌ రావు, కామినేని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.