
తాజా వార్తలు
‘రౌడీ’ సాయం.. గోల్డ్ మెడల్ గెలిచిన గణేష్
హైదరాబాద్: టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ చేసిన ఆర్థిక సాయంతో ఓ యువకుడు కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. మెదక్ జిల్లాకు చెందిన గణేష్ ఎంబారీ న్యూదిల్లీలో నిర్వహించే అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనాలనుకున్నాడు. ఆ పోటీల్లో పాల్గొనేందుకు ఎంట్రీ ఫీజు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఈ క్రమంలో గణేష్ ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకున్న విజయ్ దేవరకొండ.. తనకు చెందిన ‘దేవర ఫౌండేషన్’ తరుఫున ఎంట్రీ ఫీజుకు కావాల్సిన 24 వేల రూపాయలను ఇటీవల గణేష్‌కు అందించారు. ‘దేవర ఫౌండేషన్’ అందించిన ఆర్థికసాయంతో గణేష్ పోటీల్లో పాల్గొన్నాడు. అలా ఫిబ్రవరి 13న జరిగిన ఫైనల్లో విజేతగా నిలిచి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు.
దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్ వేదికగా షేర్ చేసిన గణేష్.. ఆర్థిక సాయం అందించిన విజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘వాకో ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2020. థ్యాంక్యూ విజయ్ దేరకొండ. మీ ఆర్థికసాయం, సపోర్ట్ లేకుంటే నేను ఈ విజయాన్ని పొందలేకపోయేవాడిని. మీరు రియల్ హీరో’ అని గణేష్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గణేష్ షేర్ చేసిన ట్విట్ చూసిన విజయ్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘నువ్వు గెలిచావ్!! గణేష్.. నిన్వు చూస్తుంటే గర్వంగా ఉంది. నిన్ను కలవాలనుకుంటున్నాను. రౌడీ కుటుంబంలోకి నీకు స్వాగతం’ అని రిప్లై ఇచ్చారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- 2-1 కాదు 2-0!
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- ఇంకా నయం.. వారినీ తీసేస్తారనుకున్నా: గంభీర్
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
- శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
