నా తొలి పాన్‌ఇండియా చిత్రం అదే : విజయ్‌
close

తాజా వార్తలు

Published : 18/02/2020 17:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా తొలి పాన్‌ఇండియా చిత్రం అదే : విజయ్‌

హైదరాబాద్‌: నిన్నటి వరకూ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’తో బిజీగా ఉన్న విజయ్‌దేవరకొండ తన తర్వాతి సినిమాకు సిద్ధమయ్యాడు. విజయ్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఫైటర్‌’ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. పూరీ డైరెక్టర్‌గా ఇటీవల వచ్చిన చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. లవర్‌బాయ్‌ విజయ్‌దేవరకొండ, మాస్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తున్న తొలిచిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా తన తొలి పాన్‌ ఇండియా ప్రాజెక్టు అని విజయ్‌ ప్రకటించాడు. ఇటీవల విజయ్‌ ఈ సినిమా గురించి పలు విషయాలు అభిమానులతో పంచుకున్నాడు. ‘నా తొలి పాన్‌ ఇండియా సినిమా డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌తో చేస్తున్నా. ఈ సినిమా కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఫైటర్‌గా కనిపించేందుకు నా శరీరాకృతి సైతం మార్చుకున్నాను’ అని తెలిపాడు.
ఈ సినిమాలో విజయ్‌ సరసన అనన్య పాండే కనిపించనుంది. సినిమా కోసం విజయ్‌ ఇప్పటికే థాయ్‌లాండ్‌లో మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ తీసుకున్నాడు. ఈసారి విజయ్‌ సిక్స్‌ప్యాక్‌ బాడీతో కనిపించనున్నట్లు తెలుస్తోంది. హిందీలో సినిమా హక్కులను బాలీవుడ్‌ సినీ నిర్మాత కరణ్‌ జోహార్‌ దక్కించుకున్నారు. తెలుగు, హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లోనూ చిత్రం విడుదల కానుంది. ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని