close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 01/03/2020 21:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హీరోకు ముద్దుపెట్టిన విలన్‌

చెన్నై: తమిళ తలపతి విజయ్‌ కథానాయకుడిగా, విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా నటిస్తున్న చిత్రం మాస్టర్‌. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ఒక్క కోలీవుడ్‌లోనే కాక దక్షిణాదిలో సినిమా అభిమానులంతా ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌తో పాటు అభిమానుల కోసం ఒక ఆసక్తికరమైన ఫొటోను విడుదల చేసింది. ఆ ఫొటోలో విజయ్‌ సేతుపతి విజయ్‌కు ముద్దు పెడుతూ ఉన్నాడు. ఇక అప్‌డేట్‌ ఏంటంటే.. మాస్టర్‌ చిత్రీకరణ పూర్తయిందట. పోస్ట్‌ ప్రొడక్షన్‌ మాత్రమే మిగిలి ఉందని చిత్ర బృందం పేర్కొంది. ఏప్రిల్‌ 9న అభిమానుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌, సెకండ్‌లుక్‌ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలో విజయ్‌ కళాశాల విద్యార్థిగా, ఆచార్యుడిగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఓ కొరియన్‌ చిత్రానికి ఇది కాపీ సినిమా అంటూ కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, చెన్నైలోని ప్రత్యేక ప్రతిభావంతుల వసతి గృహంలో చిత్రీకరణ జరగడంతో ఈ వార్తలకు బలం చేకూర్చినట్లయింది. అయితే, అలాంటిదేమీ లేదని. సినిమా చూస్తేనే కథ అర్థమవుతుందని చిత్రబృందం స్పష్టం చేసింది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ సరసన మాళవిక రొమాన్స్‌ చేయనుంది. శాంతను భాగ్యరాజ్‌, అర్జున్‌ దాస్‌, ఆండ్రియా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఎక్స్‌బీ ఫిలిం క్రియేషన్స్‌ బ్యానర్‌పై బ్రిట్టో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.