
తాజా వార్తలు
సూపర్‌హిట్ కాంబో రిపీట్ కానుందా?
హ్యాట్రిక్ అందుకున్న విజయ్-అట్లీ
చెన్నై: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇటీవల దర్శకుడు అట్లీ ఆఫీస్‌కు వెళ్లి ఆయన్ని కలిసి వచ్చారు. అట్లీ కార్యాలయం నుంచి విజయ్ బయటకు వస్తున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. సదరు వీడియో చూసిన నెటిజన్లు.. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రానుందా? ప్రాజెక్ట్ పనుల్లో భాగంగానే విజయ్.. అట్లీని కలిశారా? అని మాట్లాడుకుంటున్నారు. ఈ మేరకు పలు ఆంగ్ల పత్రికల్లో వరుస కథనాలు వచ్చాయి. మరోవైపు, ‘తేరీ’, ‘మెర్సల్’, ‘బిగిల్’ చిత్రాలతో విజయ్-అట్లీ కాంబో ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో తాజా వార్తలపై ప్రేక్షకులు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు.
గతేడాది విడుదలైన ‘బిగిల్’ తర్వాత అట్లీ.. బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్‌తో ఓ సినిమా చేయనున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ‘మాస్టర్’ తర్వాత విజయ్ తన 65వ చిత్రాన్ని నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్లో చేయనున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపించింది. కాకపోతే సదరు వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇవీ చదవండి
పవర్‌స్టార్-సూపర్‌స్టార్ కలుస్తున్నారా?