
తాజా వార్తలు
ఆ ఊరిలో రెండంతస్తుల ఇళ్లు ఉండవు..
బెళగావి : మన దేశంలో దేవాలయాలది ప్రత్యేక స్థానం. ప్రత్యేకించి దక్షిణ భారతంలో నిర్మించే గోపురాలకూ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వాటి కంటే ఎత్తుగా లేదా సమానంగా ఇళ్లు నిర్మించకూడదన్నది ఓ ఆచారం. దశాబ్దాల నాటి ఈ కట్టుబాటును ఇప్పటికీ ఆచరిస్తోంది కోహల్లీ గ్రామం. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఉందీ ఈ ఊరు. గ్రామంలో ఉన్న సంగమేశ్వర ఆలయ గోపురమే ఎత్తయిన నిర్మాణంగా ఉండాలన్నది ఆ ఊరి ప్రజల నిర్ణయం. అందుకోసం గ్రామంలో రెండంతస్తుల ఇళ్ల నిర్మాణం పై నిషేధం విధించారు. గ్రామస్థులు తీసుకున్న ఈ నిర్ణయం కొత్తదేమి కాదు. అయినప్పటికీ ఈ నిబంధనను తు.చా తప్పకుండా పాటిస్తూ దేవుడిపై ఉన్న విశ్వాసాన్ని చాటుతున్నారు ఆ ఊరి ప్రజలు. అంతేకాదు.. సంగమేశ్వర ఆలయానికి శ్వేతవర్ణం మాత్రమే వేస్తారు. ఆలయం వెలుపల వివాహాలను అనుమతించరు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- మరో 6 పరుగులు చేసుంటే..
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- డ్రాగన్ ‘ప్లాన్’ ప్రకారమే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
