close
Array ( ) 1

తాజా వార్తలు

ఆ విషయంలో విలియమ్సన్‌ ముందున్నాడు

ఫలితాలతో నాయకత్వాన్ని గుర్తించొద్దు: కోహ్లీ

ఆక్లాండ్‌: క్రికెట్‌లో ఫలితాలను బట్టి నాయకత్వాన్ని అంచనా వేయడం సరికాదని, తానెప్పుడూ జట్టును ముందుకు తీసుకెళ్లడంపైనే దృష్టి సారిస్తానని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న భారత్‌ శుక్రవారం నుంచి ఆ జట్టుతో ఐదు టీ20లు ఆడనుంది. అనంతరం మూడు వన్డేలు, రెండు టెస్టుల్లో తలపడనుంది. తాజాగా కోహ్లీ స్థానిక మీడియాతో మాట్లాడుతూ న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో కివీస్‌ 0-3తో వైట్‌వాష్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విలియమ్సన్‌ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. కోహ్లీ ఈ విషయంపై స్పందిస్తూ కివీస్‌ సారథికి అండగా నిలిచాడు. 

‘ఫలితాలను బట్టి నాయకత్వ లక్షణాలను గుర్తించడం సరికాదు. జట్టుని ఏకతాటిపైకి తేవడంతో పాటు మన నాయకత్వంలో ఆటగాళ్లు మెరుగ్గా రాణించేలా చూడాలి. ఈ విషయంలో విలియమ్సన్‌ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించాడు. కివీస్‌ ఆటగాళ్ల పట్ల అతడికి ఎంతో నమ్మకముంది. విలియమ్సన్‌ తెలివిగల నాయకుడు. అతడిలో నేను చూసింది అదే. ఏదైనా జట్టు ఓటమిపాలైతే.. దాన్ని సమష్టి వైఫల్యంగా భావించాలి. అది కెప్టెన్‌ చేతకాని తనం కాదు. ఇలాంటి విషయాల్లో అభిమానులు తొందరపడి ఏవేవో అనుకుంటారు. ఒక సారథిగా నేను టీమిండియాకు ఏం చేయగలననేదానిపైనే ఎక్కువగా ఆలోచిస్తా. జట్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపైనే దృష్టిసారిస్తా’  అని కోహ్లీ వివరించాడు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.