close

తాజా వార్తలు

Published : 23/07/2020 17:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విరాట్‌ కోహ్లీ డబుల్‌ ధమాకా చూశారా? 

మరో పదేళ్లు ఆడాలంటూ హర్భజన్‌ సలహా..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అండర్‌-19 క్రికెట్‌లో ప్రపంచకప్‌ గెలిచి నేరుగా భారత జట్టులోకి అడుగు పెట్టారు. 2008లో జాతీయ జట్టుకు ఎంపికైన అతడు తన అద్భుతమైన బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ రికార్డులను సైతం ఒక్కొక్కటిగా బద్దలు కొడుతూ దిగ్విజయంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న విరాట్‌.. గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేశాడు. అది తన వెయ్యో పోస్టు అని పేర్కొంటూ ఇలా వ్యాఖ్యానించాడు. 

‘ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఈ ప్రయాణంలో ముందుకు సాగుతున్నా. నా మీద మీరు చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు రుణపడి ఉంటా’ అంటూ 2008-2020 మధ్యలో రెండు చేతులు ఢీకొనే ఎమోజీని జతచేశాడు. ఇదిలా ఉండగా, ఆ పోస్టులో ఇంకో విశేషం కూడా ఉంది. అదేమిటంటే.. కెరీర్‌ తొలినాళ్లలోని తన ఫొటోకు ఇప్పటి ఫొటోను ఫొటోషాప్‌లో ఎడిట్‌ చేసి అభిమానులకు డబుల్‌ ధమాకా అందించాడు. ఆ ఫొటో చూస్తే నిజంగా ఇద్దరు కోహ్లీలు ఉన్నట్లు కనపడుతోంది. దీనికి స్పందించిన అనుష్క లవ్‌ సింబల్స్‌ను కామెంట్‌గా పెట్టింది. ఇక వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ కామెంట్‌ చేస్తూ 2030వరకూ ఆడుతూనే ఉండాలంటూ సలహా ఇచ్చాడు. 




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని