
తాజా వార్తలు
అప్పుడే కరోనాను ‘సున్నా’కు తీసుకురాగలం
జెనీవా: కరోనా వైరస్ రెండో వేవ్‌ను అడ్డుకునేందుకు సరైన సమయానికి టీకాలు అందుబాటులోకి రావని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైకెల్ ర్యాన్ హెచ్చరించారు. టీకాలను ‘యూనికార్న్’ పరిష్కారంగా చూడరాదని, మరోసారి వైరస్ విజృంభణతో కొట్టుమిట్టాడుతున్న దేశాలు.. టీకాలు లేకుండానే ఆ పరిస్థితిని అధిగమించాల్సి ఉందన్నారు. సోషల్ మీడియా లైవ్‌లో మాట్లాడుతూ పలు ప్రశ్నలకు మైకెల్ సమాధానమిచ్చారు.
‘‘మనకు గణనీయమైన స్థాయిలో టీకాలు అందుబాటులోకి రావడానికి సుమారు నాలుగు నుంచి ఆరు నెలలు పడుతుందని అనుకుంటున్నా. టీకా చివరి దశకు సంబంధించిన సానుకూల ప్రకటనలు వచ్చినప్పటికీ, ప్రస్తుతం మనకు టీకా అందుబాటులో లేదు. టీకాలు లేకుండానే ఈ వైరస్‌తోనే దేశాలు ముందుకు సాగుతున్నాయి. అది లేకుండా వైరస్ గరిష్ఠ స్థాయిలను మనం అధిగమించాలి. టీకా అన్ని సమస్యలనూ పరిష్కరిస్తుందన్న నమ్మకంతో వ్యక్తిగత అప్రమత్తతకు దూరం కాకూడదు. దాని గురించి పట్టించుకొని మిగతా విషయాలు వదిలేస్తే కొవిడ్-19 సున్నాకి చేరుకోదు’’ అని మైకెల్ ప్రజలను అప్రమత్తం చేశారు.
కొవిడ్ టీకా కోసం ప్రపంచమంతా వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్-వి వంటి టీకాలను అభివృద్ధి చేసిన ఫార్మా సంస్థలు మెరుగైన ఫలితాలను ప్రకటించాయి. ఇప్పటికే స్పుత్నిక్ టీకా రిజిస్ట్రేషన్ కూడా పొందింది. మిగిలిన టీకాలు అత్యవసర వినియోగానికి అనుమతి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాయి.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
- కంగారూను పట్టలేక..
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
