close

తాజా వార్తలు

Published : 08/07/2020 00:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనలో 12 మంది అరెస్ట్‌

విశాఖ: విశాఖ జిల్లా ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో జరిగిన గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనకు బాధ్యులను చేస్తూ ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థకు చెందిన 12 మందిని విశాఖ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. విషవాయువు ఘటనకు పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ హైపవర్‌ కమిటీ సీఎం జగన్‌కు నివేదిక సమర్పించిన మరుసటిరోజే ఈ అరెస్టులు చోటుచేసుకోవడం గమనార్హం. ఆ సంస్థ సీఈవో, ఇద్దరు డైరెక్టర్లు సహా మొత్తం 12 మందిని అరెస్ట్‌ చేసినట్లు విశాఖ పోలీసు కమిషనర్‌ ఆర్‌కే మీనా వెల్లడించారు. దుర్ఘటన జరిగిన మే 7నే ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థపై గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దాదాపు రెండు నెలల తర్వాత కమిటీ నివేదిక అనంతరం ఈ అరెస్టులు చోటుచేసుకోవడం గమనార్హం. వీరి అరెస్టుకు సంబంధించి పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని