close

తాజా వార్తలు

Updated : 20/11/2020 15:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెమిడెసివిర్‌తో ప్రయోజనం లేదు: డబ్ల్యూహెచ్‌వో

ప్యారిస్‌: కరోనా చికిత్సలో మెరుగైన ఫలితాలు ఇస్తుందని భావిస్తున్న యాంటీవైరల్‌ డ్రగ్‌ రెమిడెసివిర్‌ను ఆస్పత్రిలో చేరిన వారికి ఇవ్వొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. కరోనా సోకిన వ్యక్తి ఎంతటి అనారోగ్యానికి గురైనప్పటికీ.. ఈ ఔషధాన్ని అందించొద్దని సూచించింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కొవిడ్‌-19 వ్యాధిపై ఇది ప్రభావం చూపుతున్నట్లు ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలిపింది. రికవరీ రేటు, వెంటిలేటర్‌ అవసరాన్ని తగ్గించడంలో రెమిడెసివిర్‌ పెద్దగా ఆశాజనక ఫలితాలేమీ ఇవ్వడం లేదని పేర్కొంది.

కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన ఏడు వేల మందిపై జరిపిన అధ్యయన వివరాల్ని పరిశీలించిన తర్వాత ఈ ప్రకటన చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అయితే, రెమిడెసివిర్‌ వల్ల ఎలాంటి ప్రయోజనాలూ లేవని చెప్పడం మాత్రం తమ ఉద్దేశం కాదని అధ్యయనాన్ని పర్యవేక్షించిన ప్యానెల్‌ వెల్లడించింది. కొవిడ్‌-19 బాధితులకు ఇస్తున్న సాధారణ చికిత్సతో పోలిస్తే ఈ ఔషధం అందించడానికి అవుతున్న ఖర్చు, ఇస్తున్న విధానం అంత ప్రయోజనకరంగా ఏమీ లేదన్నదే తమ అభిప్రాయం అని స్పష్టంచేసింది. 

కరోనా బారిన పడిన వారు త్వరగా కోలుకోవడంలో రెమిడెసివిర్‌ బాగా పనిచేస్తోందని కొన్ని ప్రాథమిక అధ్యయనాలు సూచించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా సహా ఐరోపా దేశాల్లో అత్యవసర పరిస్థితుల్లో వైద్యుల సలహా మేరకు దీన్ని వినియోగించడానికి అనుమతి లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం దీన్ని వినియోగించారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో ఈ ప్రకటన చేయడం గమనార్హం.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని