close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 16/04/2020 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నకిలీ వార్తల కట్టడికి డబ్ల్యూహెచ్‌ఓ ‘చాట్‌బోట్‌’

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నకొద్దీ.. తీవ్రస్థాయిలో నకిలీ వార్తలు ఎక్కువై భయాందోళనలు, గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారికి సంబంధించిన సరైన సమాచారాన్ని అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకు వచ్చింది. ప్రజలకు మరింత సులువుగా కొవిడ్‌-19 సమాచారాన్ని అందుబాటులో ఉంచటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లు సంయుక్తంగా ‘WHO కొవిడ్‌-19 చాట్‌బోట్‌’ను ఏర్పాటు చేశాయి. ఇది కరోనా వైరస్‌ను గురించి తాజా సమాచారాన్ని అందిస్తూనే, ఆ మహమ్మారికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తుంది. కాగా, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌కు ఇప్పటికే 1.3 బిలియన్ల యూజర్లు ఉన్న సంగతి తెలిసిందే.  

ఎలా ఉపయోగించాలి?

ఈ సదుపాయం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో అందుబాటులో ఉంటుంది. లేదా WHO సంస్థ వెబ్‌పేజ్‌పై ఉన్న మెసెంజర్‌ లింక్‌ ద్వారా కూడా దీనిని సులువుగా ఉపయోగించవచ్చు. సంస్థ వెబ్‌పేజ్‌లో మెసెంజర్‌ చిహ్నం కింద ఉన్న ‘‘Send Message’’ బటన్‌పై క్లిక్‌ చేయటం ద్వారా చాట్బోట్‌ తెరుచుకుంటుంది. 

ప్రస్తుతం ఈ సదుపాయం ప్రపంచ ఆరోగ్య సంస్థ చాట్‌బోట్‌ సదుపాయం ఇంగ్లీష్, ఫ్రెంచ్‌, స్పానిష్‌, అరబిక్‌ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కాగా దీనిని త్వరలో మరిన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నామని ఫేస్‌బుక్‌ ప్రకటించింది. తమ చాట్‌బోట్‌లో కొవిడ్‌-19కు సంబంధించిన గణాంకాలు, నిజానిజాలు, సలహాలు వంటివి అందుబాటులో ఉంటాయి. యూజర్లు తమకు కేటాయించిన నంబర్ ద్వారా తమ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. ఇప్పటికే వాట్సాప్‌ ద్వారా డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్‌ అలర్ట్‌ సర్వీస్‌ని 12 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారని ఫేస్‌బుక్‌ తెలిపింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.