close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120030277 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1234684530864246784 [video_short_link] => 1234684530864246784 [created_by] => [created_date] => [modified_by] => 9820033 [modified_date] => 2020-03-03 17:21:07.739048 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

ధోనీపై సురేశ్‌రైనా ప్రేమ అది!

ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న భారత క్రికెటర్లు

చెన్నై: టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై 8 నెలలు కావస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్చి 29 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ ఆడేందుకు మహీ సిద్ధమయ్యాడు. ఆదివారం చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అతడికి ఘన స్వాగతం లభించింది. అనంతరం జట్టు హోటల్‌లోనూ ఝార్ఖండ్‌ డైనమైట్‌కు ఆత్మీయ పలకరింపు లభించింది. ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసిన సీఎస్‌కే మంగళవారం మరో ఆసక్తికర వీడియోను అభిమానులతో పంచుకుంది. 

ధోనీ సహచరుడు, సీఎస్‌కే ఆటగాడు సురేశ్‌ రైనా తాజాగా ఆయన్ను కలిశాడు. ఇద్దరూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని పలకరించుకున్నారు. ఈ సందర్భంగా రైనా ఒకడుగు ముందుకేసి ధోనీ మెడపై ప్రేమతో ముద్దుపెట్టుకున్నాడు. ఈ వీడియో చెన్నై అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతోంది. తాలా, చిన్న తాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు. వారిద్దరినీ ఇలా చూడటం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  మార్చి 29న చెన్నై సూపర్‌ కింగ్స్‌ X ముంబయి ఇండియన్స్‌ జట్లు వాంఖడే ఈ సీజన్‌ను ఆరంభించనున్నాయి.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.