కొవిడ్‌ టీకా.. నెలరోజుల దూరంలో: యోగి
close

తాజా వార్తలు

Updated : 11/12/2020 13:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ టీకా.. నెలరోజుల దూరంలో: యోగి

గోరఖ్‌పూర్: కొవిడ్-19 టీకా అందుబాటులోకి రావడానికి నెల రోజుల దూరంలో ఉన్నామని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మరోవైపు, రాష్ట్రంలో ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి అదుపులో ఉందని వెల్లడించారు. ఈక్రమంలో ఆయన ‘హెల్తీ ఈస్టర్న్‌ ఉత్తర్‌ ప్రదేశ్’ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. 

‘కొవిడ్-19 టీకాకు మరో నెల రోజుల దూరంలో ఉన్నాం. రాష్ట్రం ఇప్పటికే కరోనా వైరస్‌ను అదుపులో ఉంచగలిగింది. అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాలో కొవిడ్ మరణాల రేటు 8 శాతంగా ఉండగా.. ఉత్తర్‌ ప్రదేశ్‌లో అది 1.04 శాతంగా ఉంది. మన కొవిడ్ మేనేజ్‌మెంట్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. దానిపై పరిశోధనా పత్రం సిద్ధం చేయాలి. బృంద కృషికి ఎప్పుడు ప్రశంసలు దక్కుతాయి. ఎయిమ్స్‌ వంటి సంస్థలు ఈ విషయాన్ని గ్రహించాలి. ప్రయోగశాలల్లో కంటే క్షేత్రస్థాయిలో మరింత పరిశోధన జరగాల్సి ఉంది’ అంటూ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసిన తీరును వెల్లడించారు. 

ఇవీ చదవండి: 

అమెరికాలో వ్యాక్సినేషన్ దిశగా కీలక అడుగు!

కరోనా: అమెరికాలో మరణ మృదంగం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని