close

తాజా వార్తలు

Published : 21/11/2020 10:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టీకా పంపిణీకి సిద్ధంగా ఉన్నాం: శ్వేతసౌధం

ఏడాది చివరికి 40మిలియన్ల డోసులు అందుతాయని వెల్లడి

వాషింగ్టన్‌: ఔషధ, నియంత్రణ సంస్థ అనుమతించిన వెంటనే అమెరికా వ్యాప్తంగా కరోనా టీకాను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని శ్వేతసౌధం ప్రకటించింది. ఈ ఏడాది చివరికి 40 మిలియన్ల డోసులు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించింది. ఇదంతా అధ్యక్షుడు ట్రంప్‌ మార్గనిర్దేశం వల్లే సాధ్యమయిందని అధికార ప్రతినిధి కేలే మెకనీ అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ ఆలోచన నుంచి పుట్టిన ‘ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్‌’ వల్లే ఇది సాధ్యమవుతోందని వ్యాఖ్యానించారు. టీకా పంపిణీ ప్రణాళికపై ట్రంప్‌ పాలకవర్గం అలసత్వం ప్రదర్శిస్తోందన్న బైడెన్‌ బృందం ఆరోపణల్ని కొట్టిపారేశారు.   

తాము అభివృద్ధి చేస్తున్న టీకాలు 90శాతానికి పైగా సామర్థ్యం కలిగి ఉన్నట్లు ఫైజర్‌, మోడెర్నా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, జులైలో ఫైజర్‌ టీకా అభివృద్ధి, తయారీకి ట్రంప్‌ పాలక వర్గం 1.95 బిలియన్‌ డాలర్లు కేటాయించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ని ప్రశంసిస్తూ మెకనీ తాజా వ్యాఖ్యలు చేశారు. జనవరి నుంచే వ్యాక్సిన్‌ అభివృద్ధిపై ట్రంప్‌ దృష్టి సారించారని తెలిపారు. టీకా అందజేయడానికి కావాల్సిన ప్రణాళికలను రూపొందించారన్నారు. ఈ క్రమంలో దేశంలో 64 స్థానిక పాలనా యంత్రాంగాలతో కలిసి ప్రత్యేక పంపిణీ విధానానికి రూపకల్పన చేశారన్నారు.

నాపై ఫార్మా కంపెనీలు దుష్ప్రచారం చేశాయి: ట్రంప్‌

అమెరికా ఔషధ తయారీ సంస్థలపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో ఫార్మా కంపెనీలన్నీ ఏకమై తనపై దుష్ప్రచారం చేశాయని ఆరోపించారు. అందుకోసం మిలియన్ల డాలర్లు వెచ్చించారన్నారు. బడా సాంకేతిక, మీడియా సంస్థలు తమకు వ్యతిరేకంగా పనిచేశాయన్నారు. ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని మరోసారి ఆరోపించారు. తానే గెలిచానని చెప్పుకొచ్చారు.    


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన