close

తాజా వార్తలు

Published : 21/10/2020 14:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హైదరాబాద్‌లో వర్షాలు తగ్గుముఖం పట్టే ఛాన్స్‌

హైదరాబాద్‌: గతవారం రోజులుగా వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న భాగ్యనగర వాసులకు కాస్త ఉపశమనం లభించనుంది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది రాగల 24గంటల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న తెలిపారు. దీంతో రాగల 24గంటల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నందున ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని సూచించారు. 

కోస్తాంధ్రకు వర్ష సూచన..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం రాగల 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్‌-బంగ్లాదేశ్‌ తీరంపై వైపునకు వెళ్లే సూచనలు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం అల్పపీడన ప్రాంత ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలలో మోస్తరు నుంచి విస్తారంగా,  కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.