అక్కడ పట్టిన గతే ఇక్కడా: మోదీ
close

తాజా వార్తలు

Updated : 01/11/2020 14:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్కడ పట్టిన గతే ఇక్కడా: మోదీ

పట్నా: బిహార్‌ రెండోదశ ఎన్నికల ప్రచారం వాడీ వేడిగా సాగుతోంది. అధికార విపక్షాలు విమర్శలకు పదును పెడుతున్నాయి. గత వారం కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ కీలక నేత రాహుల్‌ గాంధీ ప్రచారం నిర్వహించగా.. తాజాగా ఎన్డీయే అభ్యర్థుల తరఫున ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ చాప్రాలో ప్రచారం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లో గత శాసనసభ ఎన్నికల్లో ఇద్దరు యువరాజులకు ఎలాంటి గతి పట్టిందో.. ఇక్కడ కూడా అదే గతి పడుతుందని పరోక్షంగా రాహుల్‌గాంధీ, అఖిలేశ్‌ యాదవ్‌ పేర్లను ప్రస్తావించారు. తేజస్వి తరఫున రాహుల్‌ గాంధీ ప్రచారం నిర్వహించడాన్ని గుర్తు చేస్తూ బిహార్‌లో సింహాసనం కోసం మళ్లీ ఇద్దరు యువరాజులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అందులో ఒకరు జంగిల్‌ రాజ్‌ తనయుడు తేజస్వి అని మీ అందరికీ తెలుసని చెప్పారు. యూపీలో కాంగ్రెస్‌కు ఎదురైన పరాభవమే బిహార్‌లోనూ ఎదురవుతుందని చెప్పారు.

‘‘ మూడు నాలుగేళ్ల క్రితం ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో ఇద్దరు యువరాజులూ ప్రజల మధ్యకెళ్లి చేతులు ఊపారు. వారిని ప్రజలు తమ ఓటుతో అటునుంచి అటే ఇంటికి పంపించేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది’’ అని  మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో ములాయం సింగ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీపార్టీ, కాంగ్రెస్‌ కూటమిగా ఏర్పడ్డాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయం పాలైంది. తాజా ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌, తేజస్వి నేతృత్వంలోని ఆర్జేడీ కలిసి బరిలోకి దిగుతున్నాయి. ఇక్కడా గత ఫలితాలే పునరావృతమవుతాయని మోదీ వ్యాఖ్యానించారు.‘‘ బిహార్‌ ఎన్నికల్లో ఒక యువరాజు, మరో జంగిల్‌ రాజ్‌తో కలిశారు.యూపీలో లాగానే ఇక్కడ కూడా వారు మట్టికొట్టుకు పోతారు’’ అని మోదీ అన్నారు.

బిహార్‌లో ప్రస్తుతం రెండు ఇంజిన్ల ప్రభుత్వం ఉందని ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్‌ వ్యాఖ్యానించడాన్ని మోదీ తనకు అనువుగా మార్చుకున్నారు. డబుల్‌ ఇంజిన్‌ ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి  చేయడానికి పూనుకొంది అన్నారు. అందుకే ‘డబుల్‌ క్రౌన్‌ ప్రిన్సెస్’  సింహాసనం కోసం పోరాడుతున్నారని ఎద్దేవా చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని