close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120047330 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => _fZ3hzR2ZfA [video_short_link] => _fZ3hzR2ZfA [created_by] => [created_date] => [modified_by] => 8924876 [modified_date] => 2020-04-08 23:35:29.280194 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వస్తుందా?

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరిందన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రజలను మరింత భయాందోళనకు గురిచేసింది. ఈ సందర్భంగా కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఆరోగ్యపరంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏపీ ప్రభుత్వ వైద్య అధికారులు, నిపుణులు, వైద్యులు ఫోన్‌-ఇన్‌ ద్వారా ప్రజలకు కొన్ని సలహాలను సూచించారు. అవేంటంటే...

కరోనా అడ్డుకట్టకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? ప్రస్తుతం కరోనా ఏ దశలో ఉంది?

కరోనా వైరస్‌ ఇప్పుడు సామాజిక వ్యాప్తి మొదటి దశలో ఉంది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిపై నిరంతరం నిఘా పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆయా దేశాల నుంచి వచ్చిన వాళ్లని వలంటీర్లు, ఆశా వర్కర్ల సాయంతో గుర్తించి హోం క్వారంటైన్‌లో పెడుతున్నాం. అవసరమైన వారికి పరీక్షలు చేసి ఐసోలేషన్‌లో పెడుతున్నాం. ఎప్పుడైతే ‘మర్కజ్‌’ సంఘటన జరిగిందో.. అప్పటి నుంచి ఏపీలో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. రాష్ట్రం నుంచి దిల్లీకి వెళ్లి వచ్చిన వారిని సైతం గుర్తించి, వెయ్యి మందికిపైగా పరీక్షలు నిర్వహించాం. పాజిటివ్‌ వచ్చిన వారిని క్వారంటైన్‌లో పెట్టి చికిత్స అందిస్తున్నాం. 

కరోనా మరింత ఉద్ధృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందా?

 ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందే అవకాశం లేకపోనూలేదు. అగ్రదేశాలే.. కరోనా ధాటికి నిలవలేకపోతున్నాయి. ఈ తరుణంలో కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ తమవంతు కృషి చేయాలి. సామాజిక దూరం పాటించడం, దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు చేతి రుమాలు అడ్డం పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటుండాలి. మామూలుగా ఒక వ్యక్తి నుంచి సగటున 2.5 మందికి సోకే అవకాశం ఉంది. ఒక వేళ ఎటువంటి రక్షణ చర్యలు పాటించకపోతే.. చాలా తేలికగా ఒక వ్యక్తి నుంచి 406 మందికి వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. భౌతిక దూరం, ప్రతిఒక్కళ్లు మాస్కులు ధరించి తమ వంతుగా వ్యాధిని అరికట్టగలిగితే... వైరస్‌ను నిరోధించవచ్చు.

ఒక వ్యక్తిలో కరోనా వైరస్‌ లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్‌ వచ్చిన సందర్భాలు కొన్ని దేశాల్లో చూస్తున్నాం. ఇది ఎంత వరకు నిజం?

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల నుంచి తీసుకున్న గణాంకాలే చూసుకుంటే 20 నుంచి 30 శాతం మందికి ఎటువంటి లక్షణాలు లేకపోయినా పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలుతోంది. ముఖ్యంగా 22-45 సంవత్సరాల మధ్య వయసు వారు ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇది వాస్తవం. అనారోగ్య సమస్యలు ఉన్నా.. లేకపోయినా.. నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహిస్తే కరోనా రాకుండా చూసుకోవచ్చు.

ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఓ ఇటలీ అమ్మాయికి కరోనా సోకిందని కొన్ని వార్తా పత్రికల్లో చదివాను. ఇంక ఏ విధంగా కరోనా నుంచి బయటపడొచ్చు?

కరోనా కట్టడికి చాలా దేశాలు లాక్‌డౌన్‌ కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సడలింపులో కేవలం నిత్యావసరాలకు మాత్రమే బయటకు వెళ్లాలి. అది కూడా ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే వెళ్లాలి. మార్కెట్లకి వెళ్లినా.. భౌతిక దూరం ఆరు అడుగులు తప్పకుండా పాటించడం అలవాటు చేసుకోవాలి. అనవసరంగా ఏ వస్తువులను ముట్టుకోకుండా, మాస్కులు ధరించి ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే.. కరోనా సోకుతుందన్న భయం మీకు అక్కర్లేదు. జాగ్రత్తలు పాటించడంలో యువత ముఖ్యంగా అశ్రద్ధ చేస్తున్నారు. వయసు రిత్యా.. వారు వైరస్‌ బారిన పడినా కోలుకునే అవకాశం ఉంటుంది. కానీ వారి కుటుంబీకుల్లో వయసుపైబడిన వాళ్లు ఉంటే చాలా ప్రమాదం అని వారు గుర్తించాలి. 

బయట నిత్యావసరాల కోసం మార్కెట్లకు, కిరాణా దుకాణాలకు వెళ్లినప్పుడు అందరూ మాస్కులు ధరిస్తున్నారు. కానీ గ్లవ్స్‌ ఎవరూ వాడటం లేదు.. దీని వల్ల వైరస్‌ వ్యాప్తి ప్రభావం ఉంటుందా?

గ్లవ్స్‌, మాస్కులు అనేవి ప్రతి ఒక్కరూ ధరించాల్సిన అవసరం లేదు. ఎవరికైతే జలుబు, దగ్గు ఉంటదో.. వారి నుంచి మిగతా వారికి ఇన్‌ఫెక్షన్ రాకుండా మాస్కులు ధరించాలి. అలానే గ్లవ్స్‌ కూడా ఆస్పత్రుల్లో ఉన్న సిబ్బందికి మాత్రమే ఎక్కువ అవసరం ఉంటుంది. గ్లవ్స్ వాడకపోతే వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే దాంట్లో నిజం లేదు. బయట పనులు చేసే సమయంలో చేతులు శుభ్రంగా కడిగితే సరిపోతుంది. 

మరిన్ని సందేహాలు, సమాధానాల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి..

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.