close
Array ( ) 1

తాజా వార్తలు

బంగ్లా ఆటగాళ్ల నుంచి రక్షించడానికి..

దిల్లీ: భారత అండర్‌-19 ఆటగాడు రవి బిష్ణోయ్‌ ఎంతో నిదానస్తుడని అతడి తండ్రి మంగిలాల్ బిష్ణోయ్‌ అన్నారు. అయితే బంగ్లాదేశ్ ఆటగాళ్ల నుంచి అతడి సహచరుడిని రక్షించే నేపథ్యంలో బిష్ణోయ్‌ ఆవేశానికి గురయ్యాడని తెలిపారు. ‘‘నా కుమారుడికి ఏమైందని ఆశ్చర్యపోయా. నా పిల్లల్లో అతడు ఎంతో నెమ్మదస్తుడు. అయితే ఫైనల్‌ అనంతరం అక్కడ ఏర్పడిన పరిస్థితులను వివరించాడు. బంగ్లా ఆటగాళ్ల దాడి నుంచి అతడి సహచరుడిని రక్షించే క్రమంలో ఆవేశానికి గురయ్యానని చెప్పాడు. ఈ విషయం తెలిసిన తర్వాత నుంచి నా భార్య భోజనం చేయడం లేదు’’ అని మంగిలాల్‌ పేర్కొన్నారు. 

అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ ముగిశాక దురుసుగా ప్రవర్తించిన ముగ్గురు బంగ్లాదేశ్‌ ఆటగాళ్లతో పాటు ఇద్దరు భారత క్రికెటర్లపై ఐసీసీ సస్పెన్షన్‌ పాయింట్లు విధించిన సంగతి తెలిసిందే. బంగ్లా ఆటగాళ్లు తౌహిద్‌కు 10, షమీమ్‌కు 8, రకీబుల్‌కు 4, భారత క్రికెటర్లు ఆకాశ్‌కు 8, బిష్ణోయ్‌కు 5 చొప్పున సస్పెన్షన్‌ పాయింట్లు విధించింది. ఫైనల్లో విజయానంతరం బంగ్లా క్రికెటర్లు తౌహిద్‌, షమీమ్‌, రకీబుల్‌ హసన్‌ టీమ్‌ఇండియా ఆటగాళ్ల వైపు దూసుకొస్తూ అసభ్యకర సంజ్ఞలు చేశారు. దీంతో ఆకాశ్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌ బంగ్లా ఆటగాళ్లతో బాహాబాహి తలపడినంత పనిచేశారు.

అయితే రాజస్థాన్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ ప్రపంచకప్‌ ఆద్యంతం అందర్నీ ఆకట్టుకున్నాడు. బంతిని సుడులు తిప్పుతూ 3.48 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. భారత్‌×బంగ్లా ఫైనల్లోనూ అతడు గొప్పగా పోరాడాడు. ఆశలు లేని స్థితిలో తన మాయజాలంతో నాలుగు వికెట్లు తీసి మ్యాచ్‌పై భారత్‌లో ఆశాలు పెంచాడు. అయితే బంగ్లా బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో భారత్ ఓటమిని చవిచూసింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలోనూ బిష్ణోయ్‌కు మంచి ఆదరణ లభించింది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఏకంగా రూ.2 కోట్లు ఇచ్చి అతడిని దక్కించుకుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.