వాట్సాప్‌ అప్‌డేట్‌: ప్రతి ఛాట్‌కి కొత్త వాల్‌పేపర్‌

తాజా వార్తలు

Published : 01/12/2020 20:41 IST

వాట్సాప్‌ అప్‌డేట్‌: ప్రతి ఛాట్‌కి కొత్త వాల్‌పేపర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత కొద్ది నెలలుగా వరుస కొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తూ యూజర్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది వాట్సాప్‌. తాజాగా మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఛాటింగ్‌ చేసేప్పుడు ప్రతి ఛాట్‌ పేజ్‌కి కొత్త వాల్‌పేపర్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొత్తగా వాల్‌పేపర్‌ గ్యాలరీ అప్‌డేట్ చేశారు. దాంతో పాటు టెక్ట్స్‌, ఎమోజీ సహాయంతో స్టిక్కర్స్‌ వెతికే ఫీచర్‌ని కూడా తీసుకొస్తున్నారు. కొవిడ్‌-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) టు గెదర్ హోమ్‌ స్టిక్కర్‌ని కూడా స్టిక్కర్ ప్యాక్‌లో ఇస్తున్నారు.

కస్టమ్‌ వాల్‌పేపర్ ఫీచర్‌లో భాగంగా కొత్త వాల్‌పేపర్‌ ఎంచుకునేందుకు  మీరు ఛాట్ చేసే వ్యక్తి లేదా గ్రూప్‌ ఇన్‌ఫోపై క్లిక్ చేసి కింద ఉన్న వాల్‌పేపర్ అండ్ సౌండ్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు కొత్త వాల్‌పేపర్స్‌ జాబితా కనిపిస్తుంది. అందులో కొత్తగా 32 బ్రైట్ వాల్‌పేపర్స్‌, 30 డార్క్‌ వాల్‌పేపర్స్‌ ఇస్తున్నారని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో తెలిపింది. వాటిలో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకుని బ్రైట్‌నెస్‌, ఓపెసిటీలో మార్పులు చేసుకోవచ్చు. ఒక వేళ మీకు అవేవి నచ్చకుంటే పాత వాటిని నుంచి వాల్‌పేపర్‌ ఎంపిక చేసుకునేందుకు వీలుగా కింద ప్రీవియస్‌ కలెక్షన్ ఆప్షన్ ఉంటుంది. అందులోంచి పాత వాల్‌పేపర్‌నే సెట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ అధికారికంగా విడుదల చేసినప్పటికీ కొద్ది మంది ఆండ్రాయిడ్ యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 

 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని