close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 30/04/2020 15:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాట్సాప్‌ నుంచి ‘మల్టీ’ ఫీచర్‌!

ఇంటర్నె‌డెస్క్‌: వాట్సాప్‌.. స్మార్ట్‌ఫోన్‌ వాడే ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగం అయిపోయిన యాప్‌. కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాదు.. వృత్తి జీవితంలో  భాగపోయింది. అందుకే ఎప్పటికప్పుడు వాట్సాప్‌ తన ఫీచర్స్‌ను అప్‌డేట్‌చేస్తూ వస్తోంది. ఇప్పటికీ ఈ యాప్‌ విషయంలో ఉన్న అసంతృప్తి ఏంటంటే..? మల్టీ డివైజ్‌ సపోర్ట్‌ లేకపోవడం. గతేడాదే ఈ ఫీచర్‌ వాట్సాప్‌ పరీక్షించినప్పటికీ ఎందుకో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఇప్పుడు మళ్లీ ఆ సదుపాయాన్ని వాట్సాప్‌ పరీక్షిస్తోంది. ప్రస్తుతం 2.20.143 ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్‌ కనిపించిదట.

వాట్సాప్‌ ఒక డివైజ్‌లో వాడుతున్నప్పుడు ఇంకో డివైజ్‌లో వాడలేం. ఒకవేళ అందులో వాడాలంటే ఇంకో దానిలో వాట్సాప్‌ పనిచేయదు. రెండు చోట్లా వాడాలనుకునేవారు ఈ విషయంలో నిరాశకు గురౌతున్నారు. ప్రస్తుతం ఏక కాలంలో ఒకే అకౌంట్‌ వాడాలంటే ఉన్న ఏకైక ఆప్షన్‌ వాట్సాప్‌ వెబ్‌ మాత్రమే. అయితే, ఈ మల్టీ డివైజ్‌ ఫీచర్‌ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే అందుబాటులోకి వస్తే ఒక ఫోన్‌, టాబ్లెట్‌ లేదా ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌తో ఒకేసారి రెండు వేర్వురు ఫోన్లలో వాట్సాప్‌ను వినియోగించుకోవచ్చు.

 

ఇవీ చదవండి..

వాట్సాప్‌ కొత్త ఫీచర్లు: బ్లూ టిక్‌ కొట్టేయండి
గూగుల్‌ మీట్‌లో జూమ్‌ తరహా ఫీచర్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.