కరోనా ఎఫెక్ట్‌: వాట్సాప్‌ కీలక నిర్ణయం
close

తాజా వార్తలు

Updated : 07/04/2020 15:52 IST

కరోనా ఎఫెక్ట్‌: వాట్సాప్‌ కీలక నిర్ణయం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఔషధం లేని మహమ్మారి కరోనా వైరస్‌ ప్రపంచ ప్రజలను వణికిస్తోంది. దీని గురించి సరైన సమాచారం తెలియక, అంతర్జాలంలో లభిస్తున్న సమాచారం నిజమైందో కాదో నిర్ధారించుకోలేక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19కు సంబంధించి తప్పుడు సమాచారం వ్యాప్తించకుండా ఆపేందుకు వాట్సాప్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 

తమ యాప్‌లో తరచుగా షేర్‌ అయ్యే మెసేజ్‌లను ఇకమీదట ఒకసారి ఒక్కరికి మాత్రమే షేర్‌ చేయగలిగే విధంగా వాట్సాప్‌ కట్టుదిట్టం చేసింది. ఇప్పటి వరకూ ఇలాంటి మెసేజ్‌లను ఒకేసారి ఐదుగురికి షేర్‌ చేయగలిగే వీలు ఉంది. తాజా చర్యతో యూజర్లు వాట్సాప్‌లో మెసేజ్‌లను ఫార్వర్డ్‌ చేయడం 25 శాతం మేరకు తగ్గుతుందని ఆ సంస్థ వివరించింది. 

అంతేకాకుండా తమకు వచ్చిన సమాచారాన్ని ధృవీకరించుకునే సదుపాయాన్ని కల్పించేందుకు కూడా వాట్సాప్‌ కృషిచేస్తోంది. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే.. ఆ మెసేజ్‌లపై మాగ్నిఫైయింగ్‌ గ్లాస్‌ బొమ్మ ఉంటుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఫోన్లలో బీటా వెర్షన్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ సదుపాయం.. త్వరలో అందరికీ అందుబాటులో రానుందని వాట్సాప్‌ తెలిపింది. 

కరోనా నివారణా చర్యలకు తమ వంతు సాయంగా వాట్సాప్‌ సంస్థ 1 మిలియన్‌ డాలర్లను విరాళంగా ఇచ్చింది. ‘కొవిడ్‌-19 వాట్సాప్‌ చాట్ బోట్‌’ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించింది. కరోనా గురించిన సమాచారాన్నిచ్చే ‘కరోనా వైరస్‌ ఇన్ఫర్మేషన్‌ హబ్‌’ను కూడా ఈ ఆన్‌లైన్‌ సంస్థ ఏర్పాటు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని