మోదీ ట్విటర్‌ అన్‌ఫాలోపై వైట్‌హౌజ్‌ క్లారిటీ!
close

తాజా వార్తలు

Published : 30/04/2020 13:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోదీ ట్విటర్‌ అన్‌ఫాలోపై వైట్‌హౌజ్‌ క్లారిటీ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ, ప్రధాని కార్యాలయం ట్విటర్‌ ఖాతాలను వైట్‌హౌజ్‌ అన్‌ఫాలో చేసిన విషయం తెలిసిందే. దీనిపై సామాజిక మాధ్యమాల్లో భారతీయుల నుంచి పలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో శ్వేతసౌధం స్పందించింది. విదేశీ పర్యటనలో సమయంలో అమెరికా అధ్యక్ష భవనం ఆయా దేశ అధినేతలు, వారి కార్యాలయాలను ట్విటర్‌లో తాత్కాలికంగా మాత్రమే అనుసరిస్తుందని స్పష్టం చేసింది. పర్యటన పూర్తయిన తర్వాత వీటిని అన్‌ఫాలో చేయడం సాధారణ ప్రక్రియ అని ఓ ప్రకటనలో తెలిపింది. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫిబ్రవరి నెలలో భారత్‌ పర్యటించిన సమయంలో వైట్‌హౌజ్‌ కార్యాలయం ప్రధాని మోదీతో పాటు ఆరుగురి ట్విటర్‌ ఖాతాలను అనుసరించింది. ప్రస్తుతం వైట్‌హౌజ్‌ కేవలం అక్కడి 13ఖాతాలను మాత్రమే అనుసరిస్తుండగా.. శ్వేతసౌధం‌ ఖాతాను మాత్రం దాదాపు రెండు కోట్ల మంది అనుసరిస్తున్నారు.

ఇవీ చదవండి.

అమెరికాలో 2వేల మంది ఖైదీలకు కరోనా?

దేశీయ ప్రయాణాలకు ట్రంప్‌ గ్రీన్ సిగ్నల్‌


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని