చాహల్‌కు కాబోయే సతీమణి గురించి తెలుసా?
close

తాజా వార్తలు

Published : 10/08/2020 10:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చాహల్‌కు కాబోయే సతీమణి గురించి తెలుసా?

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ ఇండియా ఆటగాడు చాహల్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ధనశ్రీ వర్మను తాను వివాహం చేసుకోబోతున్నానంటూ శనివారం ఈ స్పిన్నర్‌ ప్రకటించాడు. ధనశ్రీ వృత్తిపరంగా వైద్యురాలే అయినప్పటికీ ఆమె యూట్యూబ్‌ స్టార్‌గానే ఎక్కువ మందికి పరిచయం. ఆమె కొరియోగ్రఫీ చేసిన కొన్ని వీడియోలకు లక్షలకొద్దీ వ్యూస్‌ లభించడం గమనార్హం. మైదానంలో ఎప్పుడూ ఉత్సాహంతో కనిపించే చాహల్‌లానే ధనశ్రీ సైతం అంతే యాక్టివ్‌గా ఉంటుందని ఆమె సోషల్‌ మీడియా ఖాతాలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

ముంబయికి చెందిన ధనశ్రీ డెంటిస్ట్‌. 2014లోనే ఆమె నవీ ముంబయిలోని డీవై పాటిల్‌ డెంటల్‌ కళాశాల నుంచి డిగ్రీ పొందింది. అయితే కొరియోగ్రఫీ అంటేనే ఆమెకు మక్కువ. ఆమెకు ధన శ్రీ వర్మ పేరిట ఓ డ్యాన్స్‌ అకాడమీ కూడా ఉంది. ఆమె సొంత యూట్యూబ్‌ ఛానెల్‌కు 15 లక్షల మంది సబ్‌స్కైబర్లు కూడా ఉన్నారు. ఆమె ఇన్‌స్టాను కూడా సుమారు 5 లక్షల మందికిగా పైగా అనుసరిస్తున్నారు. చాహల్‌తో వివాహం ఖరారైనట్లు ఆమె పెట్టిన ఇన్‌స్టా పోస్టుకు 2 లక్షకు పైగా లైకులు వచ్చాయంటే ఆమె ఫాలోయింగ్‌ను అర్థం చేసుకోవచ్చు. నటుడు కార్తీక్‌ ఆర్యన్‌, సింగర్‌ గురు రంద్వాతో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆమె ఇన్‌స్టాలో చాహల్‌ చేసిన డ్యాన్స్‌ వీడియో కూడా ఉంది. ఆమె ‘చో గడాతరా’ అంటూ చేసిన వీడియోకు ఏకంగా 48 మిలియన్లు, ‘ఓ సాకీ సాకీ’ అంటూ చేసిన ఓ వీడియోకు 16 మిలియన్ల వీక్షణలు ఉన్నాయి. ఆ వీడియోలను ఇక్కడ చూడండి..
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని