close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120018267 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => G10Z3Zw6eBI [video_short_link] => G10Z3Zw6eBI [created_by] => [created_date] => [modified_by] => 963258741 [modified_date] => 2020-02-07 19:55:46.383206 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 08/02/2020 00:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దేశమంతా మీతో సంబరాలు చేసుకుంటోంది

గువాహటి: బోడో ఒప్పందంలో భాగస్వాములైన వారందరినీ  ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. అసోంలోని కక్రోజర్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘దేశ ప్రజలందరూ మీకు కృతజ్ఞతలు చెబుతూ మీతో పాటు సంబరాలు జరుపుకొంటున్నారు. దశాబ్దాలుగా తుపాకీలతో పోరాటాలు జరిగాయి. ఇక నుంచి హింసకు తావిచ్చేది లేదు. వాటికి స్వస్తి పలికి శాంతికి ఆహ్వానం పలుకుతూ అసోం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బోడో ఒప్పందాన్ని ముట్టుకునేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. కానీ, ఆ సాహసం మేం చేశాం. యాదృచ్ఛికంగా మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరిగే సమయంలోనే ఈ ఒప్పందం జరగడం విశేషం. రూ.1500కోట్లతో బోడోల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీని ఇస్తున్నాం. వారి హక్కులను కాపాడతాం’ అని ఆయన హామీ ఇచ్చారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరు నెలల్లో తనను కర్రలతో కొడతారంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. ‘కొంతమంది నేతలు నన్ను కర్రలతో కొట్టడం గురించి మాట్లాడతారు. కానీ, నేను భారతదేశంలోని తల్లులందరి ఆశీర్వాదాలతో రక్షించబడుతున్నాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు’ అని మోదీ తెలిపారు. హింసను ఎంతమాత్రం ప్రేరేపించేది లేదని ఆయన హెచ్చరించారు.  ‘ఏ ర్యాలీలోనూ ఇంతమంది పాల్గొనడం చూడలేదు. హెలికాప్టర్‌ నుంచి ర్యాలీ ప్రదేశాన్ని నేను చూశాను. జనసంద్రంతో నిండిపోయింది. నన్ను ఆశీర్వదించేందుకు మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు. 

ఈశాన్య రాష్ట్రాల్లో ఇక నుంచి ప్రతి 10-15 రోజులకు ఒకసారి కేంద్రమంత్రులు పర్యటిస్తారని మోదీ తెలిపారు. ఒక రోజు రాత్రి ఇక్కడే గడిపి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కారిస్తారని ఆయన వెల్లడించారు. పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిన తర్వాత తొలిసారి ప్రధాని మోదీ అసోంలో పర్యటించారు. సీఏఏను వ్యతిరేకిస్తూ అసోంలో తీవ్ర ఆందోళనలు జరిగాయి. దీంతో మోదీ ఖేలో ఇండియా ప్రారంభోత్సవానికి కూడా హాజరుకాలేదు. బోడో తీవ్రవాద బృందాలు, విద్యార్థి సంఘాలతో కేంద్ర ప్రభుత్వం శాంతి ఒప్పందం చేసుకున్న తర్వాత మోదీ ఇక్కడ పర్యటించారు. 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.