close

తాజా వార్తలు

Updated : 23/11/2020 22:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోలవరం ప్రారంభానికి ప్రతిపక్షాలనూ ఆహ్వానిస్తాం


అమరావతి: పోలవరం డ్యామ్‌ వద్ద ప్రస్తుతం మూడువేల మంది పనిచేస్తున్నారని మంత్రి అనిల్‌ తెలిపారు. పనులకు ఆటంకం కలుగుతుందన్న కారణంతోనే ప్రాజెక్టు వద్దకు సీపీఐ నేతలను అనుమతించలేదని చెప్పారు. ప్రాజెక్టు ఎత్తును అంగుళం కూడా తగ్గించటం లేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి డ్యామ్‌ పూర్తవుతుందని, ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలను కూడా ఆహ్వానిస్తామన్నారు. డ్యామ్‌ ఎత్తును తగ్గిస్తున్నామనటంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. మెయిన్‌ డ్యాం పనులు ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయని ఇప్పుడు ప్రాజెక్టు వద్దకు వెళ్లటమనేది పనులకు ఆటంకం కలిగించడమేనన్నారు. ప్రస్తుతం గేట్లు తదితరాల పనులు జరుగుతున్నట్లు అనిల్‌ తెలిపారు.


 




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని