
తాజా వార్తలు
పార్టీ మారితే చెబుతా: స్వామిగౌడ్
హైదరాబాద్: పార్టీ మారితే తప్పకుండా చెబుతానని తెరాస నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ అన్నారు. పార్టీ మారుతున్నాననే వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. స్వామిగౌడ్‌ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కలిశారు. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భాజపాలో చేరుతున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, స్నేహపూర్వకంగానే కలిశామని వివరించారు. ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు కలవకూడదనే నిబంధనలేమీ లేవని ఆయన అన్నారు. ఏదైనా విశేషం ఉంటే మీడియాకు తప్పకుండా చెబుతానని స్వామిగౌడ్ అన్నారు.
Tags :
జిల్లా వార్తలు