close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 29/06/2020 10:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘కట్టడికి దారులన్నీ మూసుకుపోతున్నాయి’

అమెరికాలో వైరస్‌ విజృంభణపై హెల్త్‌ సెక్రటరీ వ్యాఖ్య

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి అల్లకల్లోలానికి గురిచేస్తోంది. కొత్త కేసులు రోజురోజుకీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ తరుణంలో యూఎస్‌ ‘హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌’ సెక్రటరీ అలెక్స్‌ అజర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారిని కట్టడి చేసే దారులు రోజురోజుకీ మూసుకుపోతున్నాయని వ్యాఖ్యానించారు. ‘‘ రెండు నెలల క్రితంతో పోలిస్తే పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రస్తుతం పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఈ మహమ్మారిని అదుపులోకి తెచ్చేందుకు మేమేవైనా చర్యలు తీసుకుందామంటే.. అందుకు గల దారులన్నీ మూసుకుపోతున్నాయి’’ అని ఆదివారం ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ అజర్‌ అన్నారు. అయితే, మహమ్మారిని ఎదుర్కొనేందుకు గతం కంటే మరింత సమర్థంగా సన్నద్ధమైనట్లు అజర్‌ తెలిపారు. నిర్ధారణ పరీక్షల సంఖ్య, ఆసుపత్రుల సామర్థ్యం, వ్యక్తిగత పరిరక్షణ కిట్లను భారీగా పెంచుకున్నట్లు వెల్లడించారు. 

అమెరికాలో కేసుల సంఖ్య మరోసారి విజృంభించడానికి గల కారణాలను ఈ సందర్భంగా అజర్‌ విశ్లేషించారు. 35 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారే ఎక్కువగా మహమ్మారి బారిన పడుతున్నారని తెలిపారు. వీరిలో చాలా మందికి ఎలాంటి లక్షణాలు లేనట్లు గుర్తించామన్నారు. వీరే వైరస్‌ వాహకులుగా మారారని..అందుకే మహమ్మారి భారీ స్థాయిలో విస్తరిస్తోందని విశ్లేషించారు. షట్‌డౌన్‌ ఎత్తివేత వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందన్న వాదనను అజర్‌ కొట్టిపారేశారు. ప్రజలు వ్యక్తిగతంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని ఆరోపించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచించారు. లేదంటే వైరస్‌ విస్తరిస్తూనే ఉంటుందని హెచ్చరించారు. 

గత కొన్ని రోజులుగా అమెరికాలో రోజుకి 40 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఒకప్పుడు వైరస్‌కు కేంద్రంగా ఉన్న న్యూయార్క్‌ నగరంలో తీవ్రత తగ్గుముఖం పట్టగా ఇప్పుడు అమెరికా పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అరిజోనా రాష్ట్రంలో ఆదివారం కొత్త కేసుల సంఖ్య 267 శాతం పెరిగింది. న్యూయార్క్‌లో శనివారం కేవలం ఐదుగురు మాత్రమే మృతిచెందారు. ఏప్రిల్‌ నెలలో సగటున ఇక్కడ రోజుకు 800 మరణాలు సంభవించిన విషయం తెలిసిందే.

సోమవారం ఉదయం 9:30 గంటల సమయానికి అమెరికాలో 25,93,169 కేసులు నమోదయ్యాయి. వీరిలో 16,76,572 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 7,88,904 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. 1,27,693 మంది మరణించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.