కుమారుడిని 28 ఏళ్లపాటు బంధించిన తల్లి
close

తాజా వార్తలు

Updated : 02/12/2020 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుమారుడిని 28 ఏళ్లపాటు బంధించిన తల్లి

దంతాలు విరగ్గొట్టి, ఒంటిపై వాతలు పెట్టి చిత్రహింసలు

 

స్టాక్‌హోమ్‌: ప్రేమను పంచాల్సిన తల్లి కర్కశత్వాన్ని ప్రదర్శించింది. కన్న కుమారుడిని ఏళ్లపాటు బంధించి చిత్ర హింసలకు గురిచేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 28 ఏళ్ల పాటు కుమారుడిని బంధించి హింసించిన ఘటన స్వీడన్‌లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు సదరు మహిళను అరెస్టు చేశారు. గాయాలతో ఉన్న ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. స్టాక్‌హోమ్‌లోని మహిళ (70) ఇంటికి వెళ్లిన ఓ బంధువు ఆ ఇంట్లో బందీగా ఉన్న ఆమె కుమారుడి(41)ని గుర్తించాడు. దీనావస్థలో ఉన్న అతడిని విడిపించి ఆసుపత్రిలో చేర్పించాడు. అతడి దంతాలు పూర్తిగా ఊడిపోయి ఉన్నాయి. శరీరంపై గాయాలున్నాయి. వైద్యులు పోలీసులకు సమాచారం అందించడంతో సదరు మహిళను అరెస్టు చేసి విచారిస్తున్నారు. 

12 ఏళ్ల కుమారుడు పాఠశాలలో ఉన్నప్పుడు పాఠశాలకు వెళ్లిన తల్లి అతడిని ఇంటికి తీసుకొచ్చి గదిలో బంధించింది. తర్వాత కుమారుడిని చిత్రహింసలకు గురిచేసింది. ఆ చిత్రహింసలు 28 ఏళ్లపాటు సాగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అతడి దంతాలను పూర్తిగా విరగ్గొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్న బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు మాట్లాడలేకపోతున్నాడు. ‘ఆ ఇంటికి వెళ్లినప్పుడు ఇంట్లో నుంచి తీవ్రస్థాయిలో దుర్వాసన వచ్చింది. ఆ ఇంటిని శుభ్రం చేయక ఏళ్లు గడుస్తున్నట్లుంది. అక్కడి పరిస్థితి చూశాక షాక్‌కు గురయ్యా. ఆమె తన కుమారుడిపై పూర్తిస్థాయిలో ఆధిపత్యం చలాయిస్తోందని తెలుసు కానీ.. అది ఇంత తీవ్రస్థాయిలో ఉందని ఊహించలేకపోయా. అతడిని కాపాడినందుకు ఆనందంగా ఉంది’ అని సదరు బంధువు మీడియాతో పేర్కొన్నారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని