
తాజా వార్తలు
ఆరు నెలలుగా తల్లి మృతదేహంతో జీవనం
ముంబయి: మానసిక సమస్యలు.. ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితి.. వెరసి ఓ మహిళ తన తల్లి మృతదేహంతో ఆరు నెలలుగా జీవనం సాగించిన దుర్భర సంఘటన ఇది. స్థానికుల సమాచారంతో ఎట్టకేలకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. ముంబయిలోని బాంద్రా ప్రాంతానికి చెందిన తల్లి, కుమార్తె కలిసి ఓ ఇంట్లో జీవించేవారు. అయితే ఈ ఏడాది మార్చిలోనే తల్లి (83) మృతి చెందింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న కుమార్తె (53) తల్లి మృతిపై ఎవరికీ సమాచారం అందించలేదు. బయటి వ్యక్తులెవరితో సత్సంబంధాలు లేకపోవడంతో ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఇంట్లోని చెత్తతోపాటు, మలాన్ని కూడా కిటికీ నుంచి బయట పడేస్తుండటంతో ఇంటి చుట్టుపక్కల వారు శనివారం పోలీసులకు సమాచారం అందించారు. సదరు మహిళ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సదరు మహిళ మానసిక సమస్యలతో బాధపడేదని, ఎవరితో మాట్లాడేది కాదని స్థానికులు వెల్లడించారు. కొద్ది సంవత్సరాల క్రితం వారు పెంచుకున్న శునకం మృతిచెందినప్పుడు కూడా ఆ శవాన్ని ఇంట్లోనే ఉంచుకున్నట్లు వారు పేర్కొన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆసుపత్రిలో చేర్పించామని పోలీసులు తెలిపారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- కన్నీటి పర్యంతమైన మోదీ
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- కంగారూను పట్టలేక..
- ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్
- రెరా మధ్యే మార్గం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
