close

తాజా వార్తలు

Published : 03/08/2020 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈసారి మహిళల ఐపీఎల్‌ కూడా ఉంటుంది

స్పష్టం చేసిన సౌరభ్‌ గంగూలీ

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ కారణంగా ఈసారి యూఏఈలో నిర్వహించే ఐపీఎల్‌లో మహిళల మ్యాచ్‌లు కూడా ఉంటాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఆదివారం స్పష్టం చేశాడు. సెప్టెంబర్‌ 19 నుంచి గల్ఫ్‌ దేశాల్లో నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్‌లో కచ్చితంగా అమ్మాయిలకు చోటిస్తామని పేర్కొన్నాడు. ఆ విషయంలో బీసీసీఐ కట్టుబడి ఉందని, వారిని నాలుగు జట్లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహిస్తామని తెలిపారు. 

మరోవైపు ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ వచ్చేనెల 19 నుంచి ప్రారంభమయ్యే విషయంపై స్పష్టత వచ్చినా, ఫైనల్‌ మ్యాచ్‌ తేదీపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంతో పాటు టోర్నీ నిర్వహణకు సంబంధించి, ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఐపీఎల్‌ పాలకమండలి నేడు సమావేశం కానుంది. అందులో అన్ని విషయాలపైనా సమగ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మహిళల మ్యాచ్‌లు నిర్వహిస్తామని, నవంబర్‌ 1 నుంచి 10 తేదీల మధ్య అవి ఉంటాయని ఓ అధికారి వెల్లడించాడు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.