close

తాజా వార్తలు

Updated : 30/10/2020 10:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెన్నై అలా చేసినా ఆశ్చర్యపడను..

ధోనీ-చెన్నై బంధమదే: గంభీర్‌

దిల్లీ: రాబోయే ఐపీఎల్‌ సీజన్‌లోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం మహేంద్రసింగ్‌ ధోనినే కెప్టెన్‌గా కొనసాగిస్తే ఆశ్చర్యపడనని భారత క్రికెట్‌ జట్టు మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు.  ‘‘కెప్టెన్‌-యజమానుల మధ్య బలమైన బంధానికి చెన్నై ఉదాహరణ. వాళ్లు ఎంఎస్‌కు ఎంతో స్వేచ్ఛనిచ్చారు.. మరెంతో గౌరవించారు. కాబట్టి ఆడినంత కాలం వాళ్లు అతణ్ని జట్టు కెప్టెన్‌గా కొనసాగిస్తే ఆశ్చర్యపడను. వచ్చే సీజన్లో మహి కొత్త జట్టుతో బరిలో దిగే అవకాశం ఉంది. చెన్నైకి అతనెంతో చేశాడు. మూడు ఐపీఎల్‌ ట్రోఫీలఅందుకే ధోనికి చెన్నై యాజమాన్యం ఎంతో విలువ ఇస్తుంది. అతను కూడా తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడేందుకు ప్రయత్నిస్తాడు. సీఎస్‌కేకు కెప్టెన్సీ చేస్తున్నప్పుడు ధోని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటాడు’’ అని గౌతి చెప్పాడు. Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని