close

తాజా వార్తలు

అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి నెలకొనాలి: భారత్‌

దిల్లీ: అమెరికా-ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు వీలైనంత త్వరగా తగ్గిపోవాలని కోరుకుంటున్నట్లు భారత్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయమై గల్ఫ్‌ ప్రాంతంలోని ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ గురువారం ప్రకటన  చేశారు. ‘‘గల్ఫ్‌ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తోంది’’ అని అన్నారు. అమెరికా-ఇరాన్‌ రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు భారత్ చేపట్టే ఏ చర్యలనైనా ఇరాన్‌ స్వాగతిస్తుందని భారత్‌లోని ఇరాన్‌ రాయబారి ప్రకటించిన నేపథ్యంలో రవీశ్‌ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

గత వారం బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా జరిపిన డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ ఖుద్స్ ఫోర్స్‌ అధినేత జనరల్ ఖాసీం సులేమానీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇరాక్‌ పారామిలిటరీ డిప్యూటీ చీఫ్ హషీద్‌ అల్‌ షాబీ కూడా మృతి చెందారు. అయితే దీని ప్రతిగా ఇరాక్‌లోని అమెరికా సేనలు లక్ష్యంగా ఇరాన్‌ బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడులు అమెరికాకు చెంప దెబ్బ అని ఇరాన్‌ వ్యాఖ్యానించింది. సులేమానీ మృతితో అమెరికా-ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.