
తాజా వార్తలు
స్థానిక ఎన్నికలపై తెదేపావి పగటి కలలు: రోజా
తిరుమల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో పూర్తవుతుండటంతో ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని తెదేపా నేతలు పగటి కలలు కంటున్నారని ఏపీఐఐసీ ఛైర్పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఆమె శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల రోజా మాట్లాడుతూ.. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక కోసం తెదేపా అభ్యర్థిని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. గతంలో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు మరణిస్తే అక్కడ వైకాపా పోటీ చేయలేదన్న రోజా.. తెదేపా మాత్రం హడావుడిగా అభ్యర్థిని ప్రకటించిందని విమర్శించారు. తిరుమలలో వేయి కాళ్ల మండపం నిర్మాణానికి ప్రణాళికలు జరుగుతున్నాయని, అందుకు సంబంధించిన ఆకృతులన్నీ తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దగ్గర సిద్ధంగా ఉన్నట్లు రోజా పేర్కొన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కన్నీటి పర్యంతమైన మోదీ
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- కంగారూను పట్టలేక..
- రెరా మధ్యే మార్గం
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
