యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారు: యనమల
close

తాజా వార్తలు

Published : 19/12/2020 17:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారు: యనమల

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో వందల మంది పోలీసులతో వైకాపా యుద్ధ వాతావరణం సృష్టించిందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తొండంగిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి యనమల లేఖ రాశారు. మత్స్యకారులు, రైతులు, మహిళల ఆందోళనలను పెడచెవిన పెట్టిన సీఎం.. వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. కోనసీమ ప్రాంతంలో రసాయన పరిశ్రమల ఏర్పాటుతో మత్స్యకారుల జీవనోపాధికి గండి పడుతుందని.. అంతేకాకుండా జీవనోపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. తెదేపా సహా ప్రతిపక్షాల హెచ్చరికలను సీఎం జగన్‌ బేఖాతరు చేయడం గర్హనీయమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌ గాలికొదిలేశారని దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతును నొక్కేయడం.. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అశాంతి, అభద్రత నెలకొందని.. ప్రశాంతమైన గోదావరి జిల్లాలను అల్లకల్లోలంగా మారుస్తున్నారని ఆక్షేపించారు. ఇకనైనా చేసిన తప్పులను దిద్దుకొని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని యనమల హితవు పలికారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని