ఎక్కడివారిని అక్కడికి పంపిస్తే మంచిది:గెహ్లోత్‌
close

తాజా వార్తలు

Published : 21/04/2020 17:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎక్కడివారిని అక్కడికి పంపిస్తే మంచిది:గెహ్లోత్‌

జైపూర్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో జనజీవనం స్తంభించి పోయింది. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైపోతున్నారు. స్వస్థలాలకు వెళ్లాలనుకున్నప్పటికీ ప్రజారవాణా నిలిచిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడి వారు అక్కడే ఉండాల్సి వస్తోంది. కుటుంబసభ్యులు ఒక్కో చోట ఉండటంతో ఆందోళన చెందుతున్నారని, ఈ నేపథ్యంలో నాలుగైదురోజులు అనుమతిస్తే జనాలంతా స్వస్థలాలకు చేరుకుంటారని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ అన్నారు. ఆ తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తివేసే వరకు ఎలాంటి సమస్యలు ఉండబోవని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజస్థాన్‌కు చెందిన పలువురు వివిధ వ్యాపారాలు, కూలిపనుల కోసం అస్సాం, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు వెళ్లి లాక్‌డౌన్‌ కారణంగా అక్కడ చిక్కుకుపోయినట్లు గెహ్లోత్‌ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండిపోవడంతో ఆందోళనకు గురవుతున్నారని  హోం మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లానని, ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని షా చెప్పారన్నారు. ఇదే విషయమై ప్రధాని మోదీకి కూడా లేఖ రాస్తానని గెహ్లోత్‌ వెల్లడించారు. ప్రత్యేక చొరవ తీసుకొని విదేశాల్లో ఉన్న భారతీయులను రప్పించినట్లే.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా వారి స్వస్థలాలకు వెళ్లేందుకు కొన్ని రోజులు వెసులుబాటు కల్పించాలని కోరతానన్నారు. 

మరోవైపు రాజస్థాన్‌లోని కోటా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు సొంత రాష్ట్రానికి వెళ్లిపోయేందుకు రాజస్థాన్‌ ప్రభుత్వం అనుమతించి, ప్రత్యేక వాహనాలను సమకూర్చింది. దీంతో బిహార్‌ మినహా మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌, చండీగఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలన్నీ తమ విద్యార్థులను కూడా స్వస్థలాలకు రప్పించేందుకు రాజస్థాన్‌ ప్రభుత్వంలో సంప్రందింపులు చేస్తున్నాయి. అయితే మే 3 వరకు రాష్ట్రాల సరిహద్దులు దాటేందుకు అనుమతించబోమని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని