ప్రభాస్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌
close

తాజా వార్తలు

Updated : 18/08/2020 16:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ సినిమాల జోరు పెంచారు. ఇటీవల నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నట్లు ప్రకటించగా, తాజాగా తన అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.
బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ‘ఆది పురుష్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మంగళవారం ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ‘చెడుపై మంచి విజయం సాధించినందుకు సంబరాలు’ అంటూ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ను పంచుకున్నారు.

ఈ కాన్సెప్ట్‌ పోస్టర్‌లో రాముడు విల్లు ఎక్కుపెట్టినట్లు ఉండగా, పది తలల రావణుడు, గదతో దూసుకొస్తున్న హనుమంతుడు ఇలా ఇతిహాసగాథ రామాయణాన్ని తలపించేలా దీన్ని తీర్చిదిద్దారు. మరి ఇది ఇతిహాసగాథ? లేక ఆ పాత్రలు ప్రతిబింబించేలా నేటి నేటివిటీకి అనుగుణంగా తీర్చిదిద్దిన కథా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రంతోనే ప్రభాస్‌ నేరుగా బాలీవుడ్‌ చిత్రాన్ని చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయన నటించిన చిత్రాలు హిందీలో అనువాదం అయ్యాయి. ఈ చిత్రాన్ని 3డీలో తెరకెక్కిస్తుండటం గమనార్హం. హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ‘ఆది పురుష్‌’ను తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు ఇతర అంతర్జాతీయ భాషల్లోనూ డబ్‌ చేయనున్నారు. 2021లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని 2022 విడుదల చేస్తారు.

గుల్షన్‌ కుమార్‌, టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్‌కుమార్‌, కిషన్‌ కుమార్‌, ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌లు నిర్మిస్తున్నారు. నటీనటులు ఇతర సాంకేతిక బృందాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో ఓ పాన్‌ వరల్డ్‌ మూవీ చేస్తున్నారు. ఇందులో దీపిక పదుకొణె కథానాయిక. ఈ రెండు చిత్రాల తర్వాత ‘ఆది పురుష్‌’ ఉంటుంది.
Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని