close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 24/06/2020 09:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టిక్‌టాక్‌ చేసి.. ప్రేయసికి చెప్పి

ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: పరిచయం ప్రేమగా మారి.. ఆ ప్రేమ విఫలం కావడంతో టిక్‌టాక్‌ వీడియోలో తన బాధను ప్రేయసికి చెప్పి ఇంట్లో యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ కాలనీలో మంగళవారం చోటు చేసుకొంది. కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లికి చెందిన గుర్రాల సాయవ్వ-నారాయణ దంపతులు బతుకుదెరువుకు కామారెడ్డికి వచ్చారు. ఆర్థిక ఇబ్బందులకు తాళలేని నారాయణ కొన్నేళ్ల క్రితమే ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి తల్లి సాయవ్వ బీడీలు చుట్టి సాకుతోంది. వీరికి ముగ్గురు కుమారులు. వీరిలో చిన్నోడు సంతోష్‌(22). ఇద్దరు కుమారులు హైదరాబాద్‌లో పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. సంతోష్‌ డ్రైవింగ్‌ చేసేవాడు. ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. అది ప్రేమగా మారింది. విషయం తెలుసుకొన్న ఆమె తల్లిదండ్రులు సంతోష్‌ను మందలించారు. అంతేకాక ఆమెను వరంగల్‌కు తీసుకెళ్లారు. అప్పటి నుంచి సదరు యువకుడు మానసికంగా కుంగిపోయాడు. తనకు దూరమైన ప్రేయసికి ఫోన్‌ చేసేవాడు. ‘‘ నీ ఎడబాటును భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ టిక్‌టాక్‌లో వీడియో పొందుపరిచాడు. ఆ విషయాన్ని ప్రేయసికి ఫోన్‌ చేసి చెప్పిన పది నిమిషాల వ్యవధిలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. కుమారుడి ఆత్మహత్యను చూసిన తల్లి ఏడుపును ఆపేందుకు ఎవరి తరం కాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై జగదీశ్‌, ఏఎస్సై ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.