close

తాజా వార్తలు

22 ఏళ్లకే ఐపీఎస్‌ అధికారి..!

రాజ్‌కోట్‌: దేశంలోనే అత్యంత యువ ఐపీఎస్‌ అధికారిగా ఓ యువకుడు రికార్డు సృష్టించబోతున్నారు. గుజరాత్‌కు చెందిన ఆ యువకుడు 22ఏళ్లకే ఐపీఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. గుజరాత్‌లోని పాలంపూర్‌ పట్టణం కనోదర్‌ గ్రామానికి చెందిన హసన్ సఫిన్‌.. గతేడాది యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్‌ఇండియా స్థాయిలో 570 ర్యాంకు సాధించారు. అనంతరం అతడు ఐపీఎస్‌ అధికారి పోస్టుకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న హసన్‌ డిసెంబర్‌ 23న జామ్‌నగర్‌ అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా హసన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు ఐఏఎస్‌ అధికారి కావాలని లక్ష్యం ఉండేది. కానీ అది కుదరకపోవడంతో చివరకు ఐపీఎస్‌గా సేవలు చేసేందుకు నిర్ణయించుకున్నా. నా తల్లిదండ్రులు ముస్తఫా హసన్‌, నసీంభాను ఇద్దరూ ఓ వజ్రాల కంపెనీకి సంబంధించిన చిన్న యూనిట్‌లో పనిచేస్తుంటారు. నా విద్యాభ్యాసం కోసం వారు ఎంతో శ్రమించారు. వారితో పాటు అతడి కల నెరవేరడానికి పలువురు వ్యాపారులు ఆర్థిక సాయం చేసినట్లు’ చెప్పారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.