close

తాజా వార్తలు

Updated : 09/11/2020 10:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధావన్‌ భాయ్‌ మళ్లీ మర్చిపోయావా?

గబ్బర్‌ను ట్రోల్‌ చేసిన యువరాజ్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: గతరాత్రి హైదరాబాద్‌తో తలపడిన మ్యాచ్‌లో దిల్లీ 17 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి టీ20 లీగ్‌ ఫైనల్‌ చేరింది. అయితే, ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శిఖర్‌ ధావన్‌ను మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ట్రోల్‌ చేశాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ధావన్‌(78) పరుగులతో రాణించి 19వ ఓవర్‌లో ఔటయ్యాడు. సందీప్‌ శర్మ వేసిన 18.3 బంతికి గబ్బర్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే, అంపైర్‌ ఔటివ్వకముందే అతడు క్రీజు వదిలినట్లు కనిపించింది. కానీ రీప్లేలో ఆ బంతి ఆఫ్‌స్టంప్‌ అవతలికి వెళ్లినట్లు తేలింది. 

అయితే, ధావన్‌ కనీసం డీఆర్‌ఎస్‌కు వెళ్లకపోవడం యువరాజ్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో మాజీ క్రికెటర్‌ గబ్బర్‌ను ఉద్దేశించి ట్విటర్‌లో ట్రోల్‌ చేశాడు. దిల్లీ ఇన్నింగ్స్‌లో చివరి రెండు ఓవర్లలో హైదరాబాద్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారని.. నటరాజన్‌, సందీప్‌ ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదని మెచ్చుకున్నాడు. ఇక ధావన్‌ని ఉద్దేశిస్తూ.. అద్భుతంగా ఫామ్‌లో ఉన్నాడని పేర్కొంటూనే సరదాగా ఆటపట్టించాడు. ఎప్పటిలాగే డీఆర్‌ఎస్‌ కోరడం మర్చిపోయాడని చురక అంటించాడు. మరోవైపు ఛేదనలో హైదరాబాద్‌ 17 ఓవర్ల వరకు లక్ష్యం చేరేలా కనిపించినా స్టోయినిస్‌, రబాడ కీలక సమయంలో వికెట్లు తీశారు. కేన్‌ విలియమ్సన్‌(67), అబ్దుల్ సమద్‌(33), రషీద్‌ఖాన్‌(11) వరుసగా ఔటయ్యారు. ఆపై వార్నర్‌ టీమ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.



Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని