close

తాజా వార్తలు

Published : 20/08/2020 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లాభం రూ.29 కోట్లు

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.29.28 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.529.76 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడం గమనార్హం. మొత్తం ఆదాయం రూ.2,112.03 కోట్ల నుంచి రూ.1,338.41 కోట్లకు చేరింది. కొవిడ్‌-19 ప్రభావంతో వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడటం వల్ల ఆదాయాలపై ప్రభావం చూపిందని, దీని వల్ల గత ఫలితాలతో వీటిని పోల్చిచూడలేమని కంపెనీ తెలిపింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో ప్రకటనల ఆదాయం రూ.1,186.71 కోట్ల నుంచి రూ.421.06 కోట్లకు పడిపోయింది. సబ్‌స్క్రిప్షన్‌ ఆదాయం రూ.708.77 కోట్ల నుంచి రూ.744.34 కోట్లకు చేరింది. ఇక జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ గౌరవ ఛైర్మన్‌గా ఎస్సెల్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ సుభాష్‌ చంద్ర నియమితులయ్యారు. బోర్డు ఛైర్మన్‌గా ఆర్‌.గోపాలన్‌ను కంపెనీ నియమించింది.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని