close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 12/07/2020 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జొమాటో ఆదాయం రూ.2960 కోట్లు

దిల్లీ: ఆన్‌లైన్‌ ఆహార సేవల సంస్థ జొమాటో ఆదాయం గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో రెండింతలు పెరిగి 394 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.2960 కోట్లు)గా నమోదైంది. ఇక ఎబిటా దాదాపు రూ.2,200 కోట్లుగా ఉంది. 2018-19లో కంపెనీ ఆదాయం దాదాపు రూ.1440 కోట్లుగా, ఎబిటా రూ.2080 కోట్లు ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో వ్యాపారాన్ని లాభాల్లోకి తీసుకురావడంపై దృష్టి పెట్టామని, ఈ దిశగా మంచి పురోగతి సాధించామని జొమాటో వెల్లడించింది. కొవిడ్‌-19 వల్ల కంపెనీ వ్యాపార పరిమాణం తగ్గినప్పటికీ.. లాభాల్లోకి నడిచామని తెలిపింది. ఖర్చులపై నియంత్రణ కొనసాగిస్తూ వచ్చే 3-6 నెలల్లో పూర్తిగా కోలుకుంటామని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. 2019-20లో భారత ఆహార డెలివరీ స్థూల వ్యాపార విలువ 1496 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.11,250 కోట్లు)కు పెరిగింది. 2018-19లో ఇది 718 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.5395 కోట్లు)గా ఉంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.